BigTV English

Hardik Pandya : హార్దిక్ బ్యాక్ టు పెవెలియన్ ? గుజరాత్ టు ముంబయి?

Hardik Pandya : హార్దిక్ బ్యాక్ టు పెవెలియన్ ? గుజరాత్ టు ముంబయి?
Hardik Pandya update

Hardik Pandya update(Indian cricket news today):

వన్డే వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యాకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడతనికి దెబ్బ మీద దెబ్బ తగిలేలా ఉంది. ఐపీఎల్ వేలంలో మళ్లీ హార్దిక్ ని ముంబయి తీసుకునేలా ఉంది. ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


2022 సీజన్ ముందు హార్దిక్ ని రకరకాల కారణాలతో ముంబయి వదులుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుని కెప్టెన్సీ కూడా అప్పగించింది. దీంతో హార్దిక్ తనలోని కెప్టెన్ లక్షణాలను బయట పెట్టి ఆ ఏడాది టైటిల్ తీసుకొచ్చాడు. అంతేకాదు తర్వాత ఏడాది గుజరాత్ టైటాన్స్ ని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే అనుభవజ్ణుడైన ధోనీ కెప్టెన్సీ ముందు అతను తేలిపోయాడు.

మొత్తానికి ఫైనల్ లో గుజరాత్ ఓటమి పాలైంది. ఇప్పుడు కొత్తగా వేలం జరుగుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే ట్రేడింగ్ విండో మరొక్కరోజులో ముగుస్తుంది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా అంశం చర్చనీయాంశంగా మారింది.  అయితే హార్దిక్ పాండ్యా ముంబయి తరఫున ఏడేళ్లు ఆడాడు. అయితే తను మళ్లీ ముంబయికి మారడంపై చర్చలు జరిగాయని గుజరాత్ టైటాన్స్ వర్గాలు తెలిపాయి. అతను ఫ్రాంచైజీ మారే అవకాశం ఉంది. ఇంకా ఒప్పందం పూర్తి కాలేదని తెలిపాయి.


ట్రేడింగ్ లో భాగంగా రెండు జట్లు పరస్పరం ఆటగాళ్లను మార్చుకుంటాయి. మరి హార్దిక్ బదులు ముంబయి నుంచి ఎవరిని గుజరాత్ టైటాన్స్ అడుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అక్కడ ఆసుప్రతి బెడ్ పై హార్దిక్ ఉంటే, ఇక్కడ వీళ్లు అతన్ని అటూ ఇటూ మార్చేసుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యేనాటికి మరి హార్దిక్ కోలుకుంటాడా? లేదా ? అనేది ప్రశ్నగానే ఉంది.

ప్రస్తుతం చీలమండకు గాయం కావడంతో ఆపరేషన్ చేయాల్సి ఉందని అంటున్నారు. అది మళ్లీ సెట్ అయ్యేసరికి కనీసం ఆరునెలలు పడుతుందని అంటున్నారు. బహుశా వచ్చే ఏడాది జూన్ లో జరగనున్న టీ 20 వరల్డ్ కప్ కి అందుబాటులోకి రావచ్చునని చెబుతున్నారు. అయితే ఐపీఎల్ వచ్చే ఏడాది మార్చి 23 నుంచి మే 29 వరకు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈలోపునే హార్దిక్ కోలుకుంటాడా? అనేది పెద్ద ప్రశ్నగా ఉంది.

అంతకుమించి గుజరాత్ టైటాన్స్ కి కెప్టెన్ గా ఉన్న హార్దిక్ మరి ముంబయికి వెళ్లి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడతాడా? అనేది ప్రశ్నగా ఉంది. లేదంటే రోహిత్ బదులు హార్దిక్ కి కెప్టెన్సీ అప్పగిస్తారా? అనేది పెద్ద పజిల్ గా ఉంది.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×