BigTV English

Hardik Pandya: పాండ్యాకు 18 కోట్లు దండగే..ముంబై సంచలన నిర్ణయం ?

Hardik Pandya: పాండ్యాకు 18 కోట్లు దండగే..ముంబై సంచలన నిర్ణయం ?

Hardik Pandya Is Worth Rs 18 Crore, This Veteran Asked A Big Question To Mumbai Indians: ఐపీఎల్ లో ఒకప్పుడు ముంబై ఇండియన్స్ విజయాలతో దూసుకుపోయేది. రోహిత్ కెప్టెన్సీలో ఐదుసార్లు చాంపియన్ గా నిలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిల్చింది. గతేడాది నుంచి ముంబై ఇండియన్స్ లో గ్రూప్ విభేదాలు అంటూ జోరుగా ప్రచారాలు జరిగాయి. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పాండ్యాను తీసుకురావడంతో అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించి రోహిత్ ను ప్లేయర్ గా సైడ్ చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఈసారి ముంబై ఇండియన్స్ లో ఉండేది ఎవరు, ఆ జట్టును వీడేది ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది.


గత సీజన్లో హార్దిక్ పాండ్యాను తీసుకున్న కారణంగా ఈసారి కూడా హార్దిక్ పాండ్యాను కొనసాగించడం ఖాయమేనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఆల్ రౌండర్ ను కెప్టెన్ గానే కొనసాగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఈసారి ఆరుగురు ప్లేయర్లను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. మొదటి ప్లేయర్ కు 18 కోట్లు, రెండవ ప్లేయర్ కు 14 కోట్లు, మూడవ ప్లేయర్ కు 11 కోట్లు చెల్లించాలి. నాల్గవ ప్లేయర్ కు మళ్ళీ 18 కోట్లు, ఐదవ ప్లేయర్ కు 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరిని రైట్ టు మ్యాచ్ రూల్ తో దక్కించుకోవచ్చు. ముంబైను హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రానే స్టార్ ప్లేయర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ రిటెన్షన్ లిస్ట్ లో పాండ్యా ఎంతలో ఉంటాదనేది ఆసక్తికరంగా మారుతుంది. మొదటి స్థానం ఇస్తే పాండ్యాకు 18 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

అదే జరిగితే మరొక ప్లేయర్ కు మాత్రమే 18 కోట్లు దక్కే అవకాశం ఉంటుంది. అప్పుడు రోహిత్, బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ లో ఎవరో ఒక్కరు మాత్రమే 18 కోట్లు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. హిట్ మ్యాన్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ కన్నా పాండ్యా గొప్ప ఆటగాడేమీ కాదు కదా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. హార్దిక్ పాండ్యాకు అసలు 18 కోట్లు అవసరమా అంటూ అంటున్నారు. ఇదే అంశంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు కూడా స్పందించాడు. 18 కోట్ల కేటగిరిలో పాండ్యా ఉండకపోవచ్చన్నాడు. 2024 సీజన్ ను గుర్తుచేశాడు. కొన్ని నెలలుగా చాలా మార్పులు వచ్చాయని, 18 కోట్ల కేటగిరీలో బమ్రా, సూర్య కుమార్ యాదవ్ ను ఉంచాలని అభిప్రాయపడ్డాడు.


Also Read: Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

ఫామ్, ఫిట్నెస్ ప్రదర్శన ఆధారంగా హార్దిక్ 14 కోట్లు తీసుకునే విషయంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. ఒకవేళ 18 కోట్లు తీసుకుంటే అసలైన మ్యాచ్ స్పిన్నర్ గా ఉండాలన్నాడు. ఫామ్ పరంగా కన్సిస్టెన్సీ చూపించాలన్నాడు. గత సీజన్లో పాండ్యా ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుచేశాడు. 17వ సీజన్లో ప్రదర్శన హార్దిక్ శాలరీపై ఎఫెక్ట్ చూపిస్తుందన్నాడు. ఇక గత సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్లలో 10 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్ గా, ప్లేయర్ గా పాండ్యా తన అంచనాలను అందుకోలేకపోయాడు. మరోవైపు రోహిత్ శర్మ ఈసారి ఫ్రాంచైజీ మారుతాడని చర్చ జరుగుతోంది. ఏదైనా ప్రాంఛైజీకి రోహిత్ శర్మ కెప్టెన్గా వెళ్లే అవకాశాలు ఉన్నాయని, కొందరి ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×