Hardik Pandya Son : ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నిన్న హోరా హోరీ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించి ప్లే ఆప్స్ కి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓడిపోయి ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించింది. ఇక ప్లే ఆప్స్ కి చేరిన నాలుగు జట్లు ఫైనల్ అయ్యాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆప్స్ కి చేరుకున్నాయి. దీంతో ఐపీఎల్ సీజన్ ఈ సారి చాలా రసవత్తరంగా మారింది. అయితే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
పప్పా అంటూ పాండ్యా కొడుకు అరుపులు
ముంబై మ్యాచ్ లో పాండ్యా కొడుకు పప్పా పప్పా అంటూ అరుపులు వినిపించాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీతో జరిగిన కీలక పోరులో విజయం సాధించడం పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా హర్షం వ్యక్తం చేశారు. ముంబై జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్టు తెలిపాడు. గత ఏడాది హార్దిక్ సేన.. పద్నాలు మ్యాచ్ లకు కేవలం నాలుగు మ్యాచ్ ల్లో గెలిచాడు. అయితే పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన విషయం విధితమే. ఐపీఎల్ 2025 ప్రారంభంలోనూ వరుస ఓటములతో చతికిల పడింది ముంబై. ఇక ఆ తరువాత అనూహ్య రీతిలో పుంజుకొని డబుల్ హ్యాట్రిక్ విజయాలను సాధించింది. దీంతో ప్లే ఆప్స్ రేసులోకి వచ్చింది. ఇక సొంత మైదానం వాంఖడే స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది ముంబై జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు సాధించింది.
ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ముంబై బౌలర్లు..
సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 73 నాటౌట్ గా నిలిచాడు. నమన్ ధీర్ 8 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఇక లక్ష్య ఛేదనలో ప్రారంభం నుంచే ముంబై బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పవర్ ప్లే లో వరుస విరామాల్లో వికెట్లు తీసి ఫాఫ్ బృందాన్ని కోలుకోనివ్వకుండా చేసారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ను ఔట్ చేసి.. దీపక్ చహర్ శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ కే.ఎల్. రాహుల్ ను బౌల్డ్ చేసి పెవిలియన్ కి పంపాడు. ఇక ఆ తరువాత బుమ్రా, మిచెల్ సాంట్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ బ్యాటింగ్ పతనాన్ని శాసించారు. క్రీజులో పాతుకుపోవాలని చూసిన సమీర్ రిజ్వీ, విప్రాజ్ నిగమ్ రూపంలో కీలక వికెట్లు తీసిన సాంట్నర్ మరో హిట్టర్ అశుతోష్ శర్మ వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో ప్రమాదకర బ్యాటర్ ను వెనక్కి పంపించాడు. మాధవ్ తివారి, ముస్తాఫిజర్ రెహ్మన్ ను బౌల్డ్ చేసి ముంబై ని విజయ తీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో హార్దిక్ సేన 59 పరుగుల తేడా విజయం సాధించి.. ప్లే ఆప్స్ కి చేరుకుంది.
?igsh=NHQ4eHUyM3hxcXNq