BRS : మై డియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు సంచలన లేఖ రాశారు కవిత. వరంగల్‌లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ తర్వాత రాసిన ఆ లెటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పార్టీ మీటింగ్ సక్సెస్ అయ్యిందంటూనే లోపాలను బయటపెట్టారు. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ రెండు పార్టులుగా.. 6 పేజీల లేఖ రాశారు.
పంచ్ మిస్ అయింది డాడీ..
తెలంగాణ అంటే బీఆర్‌ఎస్ – తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెబుతారని చాలామంది అనుకున్నారని కవిత తన తండ్రికి రాసిన లేఖలో తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతంపై మాట్లాడతారని అనుకున్నట్టు కవిత రాసుకొచ్చారు. కేసీఆర్ స్పీచ్ బాగుందంటూనే.. ఇంకొంచెం పంచ్‌ను కేడర్ ఎక్స్‌పెక్ట్ చేసిందని తెలిపారు. ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్లు మీద మాట్లాడకపోవడం నెగిటివ్ అయిందన్నారు.
ఒక్క ఛాన్స్ ప్లీజ్..
బీసీలకు 42శాతం అంశం విస్మరించడం, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడమూ నెగిటివ్ అని లేఖలో ప్రస్తావించారు కవిత. ఇంత పెద్ద మీటింగ్‌కు పాత ఇంచార్జులను ఇవ్వడంపై కొన్ని నియోజకవర్గాల్లో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని కవిత తన లేఖలో చెప్పారు. లోకల్‌బాడీ ఎన్నికల్లో ఈ ఇంఛార్జులే బీఫామ్స్ ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ఎంపీపీలుగా ఉండాలనుకునే వాళ్లు రాష్ట్ర నాయకత్వమే బీఫామ్ ఇవ్వాలని కోరుతున్నారని కవిత తన లెటర్‌లో రాశారు. ZPTC, ZP చైర్మన్, ఎమ్మెల్యే స్థాయి నేతలు.. మిమ్మల్ని కలిసే అవకాశం దొరకడం లేదని బాధపడుతున్నారని.. అందరికీ అందుబాటులో ఉండాలని కేసీఆర్‌ను కోరారు కవిత.
బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు!
కేసీఆర్ స్టేజ్‌పైకి వచ్చేలోగా.. 2001నుంచి ఉన్న నేతలతో మాట్లాడించి ఉండాల్సిందన్నారు కవిత. ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యిందని చెప్పారు. బీజేపీ మీద కేసీఆర్ రెండు నిమిషాలే మాట్లాడడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తుపెట్టుకుంటారని.. చాలామంది ప్రచారం మొదలుపెట్టారని లేఖలో తెలిపారు. పర్సనల్‌గా తనకు కూడా బీజేపీపై కేసీఆర్ ఇంకా బలంగా మాట్లాడాలని ఉండే అంటూ రాసుకొచ్చారు. తాను బీజేపీ వల్ల ఇబ్బంది పడ్డాను కదా అందుకే కావచ్చంటూ ఎమోషనల్ అయ్యారు కవిత. మీరు ఇంకొంచెం బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అన్నారు. కాంగ్రెస్‌పై క్షేత్రస్థాయిలో నమ్మకం పోయింది.. బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందోమోనని మన కేడర్ అంటున్నారని కవిత తన తండ్రికి రాసిన లేఖలో ప్రస్తావించారు.
Also Read : కవిత లేఖ గురించి వారం ముందే లీక్ చేసిన కాంగ్రెస్.. చెక్ డీటైల్స్
నన్ను క్షమించు డాడీ..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా.. బీజేపీకి హెల్ప్ చేశామన్న మెసేజ్‌ను కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని కవిత అన్నారు. ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి.. మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్, గైడ్‌లైన్స్ ఇస్తారని అంతా ఎక్స్‌పెక్ట్ చేశారని అలా జరగలేదని కవిత వాపోయారు. ఇప్పటికైనా 1-2 రోజుల ప్లీనరీని పెట్టాలని కోరారు. పెద్దలేఖ రాసినందుకు క్షమించాలన్నారు కవిత. ఆమె రాసిన లేఖ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
తండ్రి కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ
వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సింది
2001 నుంచి మన పార్టీలో ఉన్న వారు ప్రసంగిస్తే బాగుండేది
ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలం అయ్యాం
బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేది… pic.twitter.com/w2PbYCeEJN
— BIG TV Breaking News (@bigtvtelugu) May 22, 2025