Telugu TV Serials TRP Ratings : బుల్లితెర పై ఎన్నో సక్సెస్ ఫుల్ సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. కొన్ని సీరియల్స్ ఎంతగా ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్ ఎక్కువగా ఉన్నాయి.. స్టార్ మా లో ప్రతి సీరియల్ కూడా గట్టి పోటీతో టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు వెనకడుగు వేసిన సీరియల్స్ సైతం ప్రస్తుతం మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. ఆ మధ్యరెండు మూడు వారాలు టీఆర్పీలో కిందకు పడిన ‘కార్తీక దీపం 2 నవ వసంతం’ సీరియల్ మళ్ళీ టాప్ ప్లేస్‌కు చేరుకుంది. లాస్ట్ వీక్ టాప్‌లోకి వచ్చిన ఆ సీరియల్… ఈ వారం కూడా నంబర్ 1గా నిలిచింది. టీఆర్పీ రేటింగ్స్ పరంగా మరింత దూకుడు చూపించింది. స్టార్ మా లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న 10 సీరియల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కార్తీక దీపం 2..
తెలుగు టీవీ సీరియల్స్ రీసెంట్ హిస్టరీ చూస్తే నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ‘కార్తీక దీపం 2’ అత్యంత వీక్షకాదరణతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసింది. రెండు వారాల క్రితం ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఇదే టాప్ పొజిషన్ లో ఉంది. 12.22 రేటింగ్ తో దూసుపోతుంది..
ఇల్లు ఇల్లాలు పిల్లలు..
రీసెంట్ గా స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కుటుంబంలోని మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ద్వేషాలు ఎలా ఉంటాయో అనేది ఈ సీరియల్ లో చూపించారు. ఈ సీరియల్ ఈ మధ్య ఏం మొదలైన కూడా రేటింగ్ లో మాత్రం దూసుకుపోతుంది. కార్తీకదీపం తర్వాత ఈ సీరియల్ రెండో స్థానంలో కొనసాగుతుంది.. దీని రేటింగ్ విషయానికొస్తే.. తాజాగా 11.40 రేటింగ్ నమోదైంది.
ఇంటింటి రామాయణం..
స్టార్ మా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం కూడా ఒకటి.. టైటిల్ కి తగ్గట్లే సీరియల్ లోని పాత్రలు కూడా ఉంటాయి. ఈ సీరియల్ రేటింగ్ లో మూడో స్థానంలో కొనసాగుతుంది.. ఆ సీరియల్ కు 10.15 రేటింగ్ వచ్చింది.
ఇకపోతే వీటితో పాటుగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ స్థానంలో కొనసాగుతుంది. రేటింగ్ లో 10.07 రేటింగ్ సాధించింది..
డీలా పడ్డ బ్రహ్మముడి.. గత ఏడాదిగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఇప్పుడు దారుణంగా పడిపోయింది. రాజు గతం మర్చిపోవడంతో ఈ సీరియల్ ని ఎక్కువగా జనాలు ఇష్టపడటం లేదు. దాంతో టిఆర్పి రేటింగ్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది.
అదే విధంగా.. నిన్ను కోరి సీరియల్ కూడా క్రమంగా పైకి వస్తోంది. తాజా రేటింగ్స్ లో 8.33తో ఏడో స్థానానికి దూసుకురావడం విశేషం. 6.27 రేటింగ్ తో నువ్వుంటే నా జతగా సీరియల్ 8వ స్థానంలో.. 6.10తో పలుకే బంగారమాయెనా 9వ స్థానంలో నిలిచింది… ఇవే కాదు ఇంకా కొన్ని సీరియల్స్ ఇప్పుడిప్పుడే టిఆర్పి రేటింగ్ ని పెంచుకుంటున్నాయి. కేవలం స్టార్ మా చానల్స్ లో మాత్రమే కాదు అటు జీ తెలుగులో కూడా కొన్ని సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి..