Hardik pandya latest news(Today’s sports news): వాళ్లిద్దరూ విడిపోయారు. కానీ మానవ సంబంధాలు అందునా వివాహంతో ముడిపడిన బంధాలు.. తెంచుకున్నంత సులభంగా తెగిపోవు అనడానికి పాండ్యా-నటాషా నిదర్శనాలుగా నిలుస్తున్నారు. భర్తతో తెగదెంపులు చేసుకుని, నాలుగేళ్ల కొడుకుతో సహా ముంబైని వదిలిన నటాషా సొంత దేశం సెర్బియా వెళ్లిపోయింది. అక్కడ కుమారుడు అగస్త్యాతో కలిసి థీమ్ పార్క్‌కు వెళ్లింది. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది.
భార్యాపిల్లల్ని చూసిన ఆనందంలో పాండ్యా స్పందించాడు.అంతేకాదు సూపర్ అనే ఏమోజీతో పాటు ఒక హార్ట్ ఏమోజీని జత చేశాడు. ఇది నెట్టింట మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్‌గా మారాయి. విడిపోయిన తర్వాత కూడా హార్దిక్ పాండ్యా.. తన భార్య పట్ల అదే గౌరవాన్ని, ప్రేమను వ్యక్తం చేస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇది భారతీయ వైవాహిక వ్యవస్థలోని గొప్పతనమని కొందరంటున్నారు. అందుకే మన వివాహ వ్యవస్థ ఇంత స్ట్రాంగ్ గా ఉందని ఎవరికి తోచిన రీతిలో వారు రాసుకుపోతున్నారు.
నిజానికి పురుషాధిక్య సమాజంలో నటాషా విడిపోవడాన్ని కొందరు నెటిజన్లు జీర్ణించుకోలేకపోయారు. మగవాడు దారి తప్పితే, సరిచేసుకోవాల్సింది పోయి, అలాగే విడిపోతావా? కొడుకు భవిష్యత్తుని ఏం చేద్దామనుకున్నావ్? తన దగ్గర డబ్బులున్నాయి, బోలెడంత పేరుంది, హోదా ఉంది? ఇంకేం కావాలి నీకు? అని కొందరు నటాషాపై భయంకరమైన ట్రోలింగ్ చేశారు. ఇవన్నీ చూసి నటాషాకి వళ్లు మండి వదిలివెళ్లిపోయిందని కొందరన్నారు. అభిమానం దురభిమానంగా మారడమంటే ఇదేనని మరికొందరు కామెంట్లు చేశారు.
Also Read: 14 ఏళ్లకే ఒలింపిక్స్ లో.. భారత స్విమ్మర్ ధినిధి
ఇవన్నీ ఎందుకంటే, నటాషా, పాండ్యా విడిపోతూ తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని ప్రజలను వేడుకున్నారు. అదేమాటను మరికొందరు నెటిజన్లు కోట్ చేస్తున్నారు. వాళ్లేదో తంటాలు పడతారు. మీకెందుకు మధ్యలో మీ కుటుంబాల మధ్యలోకి వస్తే మీరు ఊరుకుంటారా? సెలబ్రిటీలు కాబట్టి, ప్రజలని ఏమీ అనలేరు కాబట్టి, వారిపై ఇలా దాడిచేయడం సరికాదని అంటున్నారు. ఇంక ఇవన్నీ చూసిందంటే నటాషా రేపటి నుంచి ఫొటోలు పెట్టదు, ఫోన్లూ చేయదు. ఇది ఒకరకంగా పాండ్యాకి అందరూ కలిసి అన్యాయం చేసినట్టే అవుతుందని అంటున్నారు.
నిజమే కదా.. ఆ దంపతుల వ్యక్తిగత జీవితంలోకి చొరబడిపోవడానికి మనం ఎవరం? వారినలా బతకనివ్వండి.. ఏమో వారి మనసులు మారి, పిల్లవాడి కోసమైనా కలిస్తే కలవచ్చు కదా అని కొందరు అంటున్నారు. ఈ అభిప్రాయంతో పలువురు ఏకీభవిస్తున్నారు.