BigTV English

Dhinidhi Desinghu: 14 ఏళ్లకే ఒలింపిక్స్ లో.. భారత స్విమ్మర్ ధినిధి

Dhinidhi Desinghu: 14 ఏళ్లకే ఒలింపిక్స్ లో.. భారత స్విమ్మర్ ధినిధి

14-year-old swimmer Dhinidhi Desinghu to represent India at the Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ మరొక్క రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో ఒకొక్క ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వ క్రీడల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు వెళ్లారు. అందులో ఒకరు  14 ఏళ్ల ధినిధి దేశింగు ఒకరున్నారు. భారత్ నుంచి పాల్గొనే అతిపిన్నవయస్కురాలిగా రికార్డ్  సృష్టించారు.


తను కర్ణాటకకు చెందిన స్విమ్మర్.. బెంగళూరులో నివాసం ఉంటారు. ప్రస్తుతం సీవీ రామన్ నగర్ లోని కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి చదువుతోంది. యూనివర్శాలిటీ కోటా సహాయంతో ధీనిధికి పారిస్ వెళ్లే అవకాశం వచ్చింది. మూడేళ్ల వయసు నుంచే ధీనిధి ఈత ప్రాక్టీస్ మొదలుపెట్టింది. చిన్న పిల్ల కావడంతో నీళ్లంటే తెగ భయపడేది. కానీ తల్లిదండ్రులు  బుజ్జగించి ఈత నేర్పించారు. దీని వెనుక ఒక కారణం ఉంది.

మూడేళ్ల వయసులో తనకి మాటలు సరిగా వచ్చేవి కావు. దీంతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంటే, ఈత నేర్చుకుంటే మాటలు వస్తాయనే నమ్మకంతో తల్లిదండ్రులు ప్రాక్టీసు చేయించారు. మొత్తానికి తనిప్పుడు గలగలా మాటలాడటమే కాదు, చకచకా ఈత కూడా కొట్టేస్తోంది. ఇంతకీ ఒలింపిక్స్ లో చోటెలా సంపాదించిందంటే జాతీయ క్రీడల్లో ధీనిధి ఏడు బంగారుపతకాలు సాధించింది. ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది.


Also Read: విరాట్ శాశ్వతంగా లండన్ వెళ్లిపోతున్నాడా?

అంతేకాదు 200 మీటర్ల ఫ్రీస్టయిల్ లో జాతీయ రికార్డ్ నెలకొల్పింది. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో కూడా పాల్గొంది. ఈసారి పారిస్ ఒలింపిక్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 200 ఫ్రీ స్టైల్ లో పాల్గొననుంది. ఈ సందర్భంగా ధీనిధి మాట్లాడుతూ ఒకప్పుడు నాకు నీళ్లంటేనే భయంగా ఉండేదని నవ్వుతూ తెలిపింది.

తర్వాత ధీనిధి తల్లి జెస్సితా మాట్లాడుతూ ఇప్పటికి తనకి చిన్నపాటి భయం ఉంది. ఎక్కువ ఒత్తిడి పడితే తలతిరిగి వాంతులు అవుతాయి. కొంచెం అలవాటు పడిందంటే, ఇంక వెనక్కి తిరిగి చూడదని అన్నారు. చాలామంది అనేదేమిటంటే తనకింక 14 ఏళ్లు కాబట్టి, అవన్నీ ఉంటాయని అంటున్నారు. అయినా దేశం తరఫున పాల్గొనే గొప్ప అదృష్టం తనకి దక్కిందని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×