Hardik Pandya’s Ex wife : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కి వచ్చినటువంటి కష్టం ఏ ఒక్కరికీ రాకూడదని కొందరూ పేర్కొంటున్నారు. ఎందుకంటే.. ఇటీవలే ఆయన భార్య నటాషా స్టాంకోవిక్ తో విడాకులు తీసుకున్నారు. అయితే ఆమె మాత్రం విడాకుల తరువాత మరో వ్యక్తితో తిరగడం మొదలు పెట్టింది. బ్రదర్ అంటూనే.. అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది. ఇక అది చాలదు అన్నట్టు ఇద్దరూ కలిసి పలు పార్టీలకు, పబ్బులకు కూడా వెళ్తున్నారు. తాజాగా ఇద్దరూ కలిసి కారులో షికార్లు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. కారులోనే ఆమె సరసాలు చేస్తున్నట్టు హార్దిక్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పాండ్యా మాత్రం నరకం అనుభవిస్తున్నాడనే చెప్పవచ్చు.
Also Read : Prithvi Shaw : ఒక్క అవకాశం ఇవ్వడిరా.. పృథ్వీ షా పోస్ట్ వైరల్
హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ లు విడాకులు తీసుకున్నప్పటికీ.. అగస్త్య కి మాత్రం తల్లిదండ్రులుగా ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే హార్దిక్ పాండ్యా అగస్త్య పాండ్యాను కూడా మచ్చిక చేసుకునేందుకు నటాషా ప్రియుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే ఓ ఈవెంట్ కి వెళ్తూ.. పాండ్యా కొడుకు ను కూడా తీసుకెళ్లాడు. తన పక్కనే కూర్చొబెట్టుకొని తండ్రిలా ఫీల్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఆ సమయంలో పలువురు నెటిజన్లు అగస్త్య పాండ్యా కొడుకా..? లేక నటాషా ప్రియుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ కొడుకా..? అని కామెంట్స్ కూడా చేశారు. మరోవైపు పాండ్యా అభిమానులు ఏంట్రా మా పాండ్యా కొడుకుని పట్టుకొని ఎక్కడికి వెళ్లావు..? నువ్వు మాకు దొరికితే చచ్చిపోతావ్ అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు పాండ్యా అభిమానులు. హార్దిక్ పాండ్యా కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపో అంటూ అలెగ్జాండర్ కి హెచ్చరికలు కూడా జారీ చేసారు. మరికొందరూ అతను నటాషా కి ప్రియుడు కాదని.. కేవలం ఫ్రెండ్ మాత్రమేనని పేర్కొంటున్నారు.
హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో గుజరాత్ టైటాన్స్, రెండో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. మే 21న ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. అలాగే ముంబై జట్టు మే 26న జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్ ల్లో కచ్చితంగా 2 మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే పంజాబ్ ప్లే ఆప్స్ కి వెళ్తుంది. ముంబై జట్టు కూడా కచ్చితంగా రెండింటికి రెండు గెలవాల్సి ఉంది. లేదంటే.. పంజాబ్ విజయం సాధిస్తే.. ముంబై కంటే ముందంజలో ఉన్న పంజాబ్ ప్లే ఆప్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. అలాగే ఢిల్లీ కూడా అన్ని మ్యాచ్ ల్లో గెలిస్తే ముంబై కి కాస్త కష్టం అనే చెప్పవచ్చు.
?utm_source=ig_web_copy_link