Prithvi Shaw : ప్రముఖ క్రికెటర్ పృథ్వీషా గత సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ ఆడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అతను చిన్న వయస్సులోనే రికార్డును నెలకొల్పాడు. అండర్ -19లో, ఐపీఎల్ లో, టెస్ట్ సిరీస్ లో ఇలా రకరకాలుగా టీమిండియా కి ప్రాతినిథ్యం వహించాడు. అయితే 2024 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఐపీఎల్ ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. కొంత మంది వేదేశీ ఆటగాళ్లు వెళ్లిపోవడంతో ఐపీఎల్ లో రీ ప్లేస్ మెంట్స్ జరుగుతున్న తరుణంలో టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఒక్క అవకాశం కావాలి అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు పృథ్వీ షా ను ఏదో ఒక ప్రాంచైజీ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read : Kohli – Anushka : కోహ్లీకి షాక్… అతనికి అనుష్క శర్మ లిప్ లాక్ ?
మరోవైపు ఇండియా-పాకిస్తాన్ యుద్ధం భయం నేపథ్యంలో టోర్నీని వీడినటువంటి విదేశీ ప్లేయర్ల స్థానంలో పృథ్వీ షా ను తీసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ప్రయత్నిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. గతంలో ఢిల్లీ తరపున ఓపెనింగ్ చేసి పలు రికార్డులను నమోదు చేశాడు పృథ్వీ షా . కానీ ఈ సీజన్ లో అతన్ని ఏ జట్టు కొనుగోలు చేయకపోవడం గమనార్హం. అంత ఫామ్ లో లేకపోవడంతో అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ జట్టు కూడా ఆసక్తి చూపించలేదు. ఇక ముఖ్యంగా 2018లో వెస్టిండిస్ తో రెండు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా టీమిండియా తరపున అంతర్జాతీయ ఆరంగేట్రం చేశాడు. 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకొని తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. భారత్ తరపున ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
14 ఏళ్ల వయసులో పాఠశాల జట్టు రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో 546 పరుగులు చేశాడు. 17 ఏళ్ల వయసులో అరంగేట్ర ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో పాటు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కైవసం చేసుకున్నాడు. తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లోనే, అదీ అతి చిన్న వయసులోనే సెంచరీ చేసిన అరుదైన రికార్డు సాధించాడు. దేశానికి అండర్–19 ప్రపంచ కప్ సారథి కూడా. ఇతను గత సీజన్ లో ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పేలవ ప్రదర్శన చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ కి ఎంపిక చేసుకోలేదు. దీంతో మిగతా ఏ జట్టు కూడా పృథ్వీషా ని కొనుగోలు చేయలేదు. ఇక ఇప్పుడైనా ఎవరైనా కొనుగోలు చేస్తారేమోనని ఆశ పడుతున్నాడు. మళ్లీ ఢిల్లీ లేదా ముంబై జట్టు కొనుగోలు చేస్తే.. ఓపెనింగ్ లో కాస్త ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది. ఈ అవకాశాన్ని కనుక అతను వినియోగించుకుంటే ముందు ముందు కూడా అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది. కానీ మరీ ఈ సారి పృథ్వీషా ని ఐపీఎల్ ఏ జట్టు అయినా తీసుకుంటుందా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది.