Kamal Haasan :థగ్ లైఫ్.. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ రెడ్ జాయింట్ మూవీస్ మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం థగ్ లైఫ్. భారీ అంచనాల మధ్య జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో దాదాపు 12 రోజులపాటు ఈ సినిమా ప్రమోషన్స్ చేపట్టనున్నారు చిత్ర బృందం అందులో భాగంగానే ఏకంగా 6 ప్రదేశాలలో ఆరుసార్లు ఈ సినిమా ప్రీ రిలీజ్ నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇతను మొత్తానికి అయితే మే 17న ప్రారంభమై జూన్ 1కి ప్రమోషన్ కార్యక్రమాలు ముగుస్తాయి ఇక జూన్ 5వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నారు ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమా కథ గురించి కమల్ హాసన్ చెప్పిన మాటలు వైరల్ గా మారుతున్నాయి.
థగ్ లైఫ్ స్టోరీ మణిరత్నంది కాదా..?
సాధారణంగా ఎక్కడైనా సరే దర్శకుడు రాసుకున్న కథను హీరో తెరపై ఆవిష్కరిస్తారు. లేదా హీరో దగ్గర ఏదైనా మంచి కథ ఉంటే అందుకు తగ్గట్టుగా డైరెక్టర్ దానిని తన స్టైల్ లో ఎస్టాబ్లిష్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు ఈ నేపథ్యంలోనే థగ్ లైఫ్ కథ మణిశర్మది కాదు.. దాని వెనక చాలా కష్టం.. ఉంది అని కమలహాసన్ తెలిపారు. కమల్ హాసన్ మాట్లాడుతూ..థగ్ లైఫ్ స్క్రిప్ట్ ను మొదట నేను “అమర్ హై” అనే పేరుతో కథ రాశాను. నేను రాసుకున్న కథలో హీరో చనిపోతాడు. కానీ మణిరత్నం దానిని పూర్తిగా మార్చి, తనదైన శైలిలో కథాంశాన్ని అభివృద్ధి చేశారు..” అంటూ కమల్ హాసన్ తెలిపారు. ఇక అంతే కాదు కమలహాసన్ మాట్లాడుతూ ఈ సినిమా స్క్రిప్ట్ వెనుక ఎంతో కష్టం ఉంది ఎన్నో మార్పులు చేర్పులు చేశాము. ఇక నేను రాసుకున్న కథకు కొద్దిగా మార్పులు చేసి దానిని తెరపై ఎస్టాబ్లిష్ చేశాము అంటూ తెలిపారు కమలహాసన్ మొత్తానికైతే కమల్ హాసన్ చెప్పిన మాటలు వింటుంటే ఈ థగ్ లైఫ్ సినిమా స్టోరీ మణిరత్నం ది కాదా కమలహాసన్ దా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
థగ్ లైఫ్ సినిమా విశేషాలు..
కమలహాసన్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో మరో హీరో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన పాట పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే దీనికి తోడు దాదాపు 38 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో అంజనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఎలాగైనా సరే ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని కమలహాసన్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా కమల్ హాసన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
also read:Balakrishna : దిల్ ఓపెన్ చెయ్ అంటున్న బాలయ్య.. ఇక కిక్కే కిక్కు..!