BigTV English

Harry Kane: ఇంగ్లీషు ఫుట్ బాల్ ప్లేయర్ కి.. గోల్డెన్ షూ

Harry Kane: ఇంగ్లీషు ఫుట్ బాల్ ప్లేయర్ కి.. గోల్డెన్ షూ

The Golden Shoe Award for Harry Kane: ప్రపంచ ఫుట్ బాల్ ప్రేమికులకు హ్యారీ ఎడ్వర్డ్ కేన్ పేరు. సుపరిచితం. తనొక ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. అలాగే ఇంగ్లాండ్ ఫుట్ బాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అంతేకాదు గేమ్ లో బెస్ట్ స్ట్రైకర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఇప్పుడెందుకు అతని ప్రస్తావన వచ్చిందంటే..


యూరోపియన్  ఫుట్ బాల్ లీగ్ లో అత్యధిక గోల్స్ చేసిన స్ట్రైకర్ గా హ్యారీ కేన్ నిలిచాడు. దీంతో అతడికి ఎంతో గౌరవప్రదమైన గోల్డెన్ షూ అవార్డు దక్కింది. మూనిచ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో హ్యారీ దీనిని అందుకున్నాడు. అలా ఫుట్ బాల్ ప్లేయర్ గా ఒక అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు ఈ లీగ్ లో ఇప్పటివరకు మూడుసార్లు టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఒక క్రికెట్ ప్లేయర్ ఒక సీజన్ లో వెయ్యి పరుగులు చేశాడు. రెండు వేల పరుగులు చేశాడని అంటూ ఉంటారు. అలాగే ఫుట్ బాల్ లో కూడా ఒక్క సీజన్ లో చేసిన గోల్స్ కి లెక్కలుంటాయి. అలా హ్యారీ కేన్.. ఒక సీజన్ లో 32 మ్యాచ్ లు ఆడి, 36 గోల్స్ సాధించాడు. అయితే ఒక సీజన్ లో అత్యధిక గోల్స్ చేసిన మాజీ స్ట్రైకర్ రాబర్ట్ (41) రికార్డుకి, ఒక 5 గోల్స్ దూరంలో ఆగిపోయాడు. లేదంటే ప్రపంచ రికార్డ్ సాధించేవాడేనని అభిమానులు పేర్కొంటున్నారు.


Also Read: దులీప్ ట్రోఫీ నుంచి ముగ్గురు అవుట్..!

31 ఏళ్ల హ్యారీ ఎడ్వర్డ్ కేన్ మాట్లాడుతూ ఈ అవార్డు అందరికీ సొంతమని అన్నాడు. మీరు లేకపోతే, నేను లేనని అన్నాడు. మీ అందరి ఆదరాభిమానాలతోనే ఇంత దూరం వచ్చాను. ఇంతవాడినయ్యాను..ఈ అవార్డు సాధించానని అన్నాడు. అందుకే ఇది నాది కాదు.. మనది అని అన్నాడు. ఇకపోతే కొత్త సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు.

నేనొక్కడిని కాదు, జట్టు మొత్తం విజయవంతంగా ఆడటం వల్లే టైటిళ్లు సాధించివచ్చునని అన్నాడు. అలా జట్టుగా ఇంతదూరం చేసిన ప్రయాణంలో మేం అందరం విజయవంతమైనట్టు భావిస్తున్నానని తెలిపాడు. ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మునిచ్ లో జరగనుంది. అక్కడ గెలిస్తే, ఇక్కడ అవార్డుకి మరింత విలువ పెరుగుతుందని అన్నాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×