BigTV English

OnePlus 9, 10 Pro Defect: వన్ ప్లస్ 9, 10 ప్రో ఫొన్లలో భారీ సమస్యలు.. రిపేరు ఖర్చు రూ.42000!

OnePlus 9, 10 Pro Defect: వన్ ప్లస్ 9, 10 ప్రో ఫొన్లలో భారీ సమస్యలు.. రిపేరు ఖర్చు రూ.42000!

OnePlus 9, 10 Pro Defect| వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసిన యూజర్లు కొత్త టెక్నికల్ సమస్యలతో సతమవుతున్నారని సమాచారం. కొత్త ఫీచర్స్ తో లాంచ్ అయిన వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 10 ప్రో సిరీస్ స్మోర్ట్ ఫోన్స్ ల మదర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. చాలామంది ఫోన్లు ఓవర్ హీట్ కావడం, ఫోన్లు హ్యాంగ్ కావడం, అనుకోకుండా షట్ డౌన్ కావడం వంటి సమస్యలు ఒక్కసారిగా ఎదురవుతున్నాయని తెలిసింది. కొంతమందికైతే ఫోన్ ఆన్ లో ఉన్నా స్క్రీన్ బ్లాక్ గా కనిపిస్తోందట.


అయితే ఈ సమస్యలకు మూల కారణం మదర్ బోర్డ్ లో ప్రాబ్లమ్ కావడంతో దాన్ని రిపేరు చేయడానికి రూ.42000 ఖర్చు అవుతుందని.. తెలిసింది. అయితే ఈ సమస్యలపై ఇంతవరకు వన్ ప్లస్ కంపెనీ పరిష్కారం చూపలేదు. పైగా కంపెనీ అధికారుల సమస్య పట్ల స్పందించపోవడం గమనార్హం.

వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసిన యూజర్లు సోషల్ మీడియాలో వన్ ప్లస్ క్లబ్ పేరుతో గ్రూపుగా ఏర్పడి కొత్త ఫోన్లలో తాము తరుచూ ఎదుర్కొంటున్న సమస్యలు, వన్ ప్లస్ కంపెనీ ఈ సమస్యలపై మౌనంగా ఉండడంపై విమర్శలు చేస్తున్నారు. పైగా వన్ ప్లస్ కమ్యూనిటీ వెబ్ సైట్ లో యూజర్లు తమకు ఎదురైన సాఫ్ట్ వేర్ సమస్య వల్ల మదర్ బోర్డ్ డ్యామేజ్ అయిందని లబోదిబోమంటున్నారు.


గతంలో కూడా ఇలాగే వన్ ప్లస్ 8 సిరీస్ యూజర్లు సమస్యలు ఎదుర్కొన్నారు. వన్ ప్లస్ 8 లో యూజర్లకు గ్రీన్ లైన్ ప్రాబ్లమ్ వచ్చింది. కానీ అప్పుడు వన్ ప్లస్ కంపెనీ ఈ గ్రీన్ లైన్ సమస్య వచ్చిన వారికి ఉచితంగా కొత్త స్క్రీన్లు ఇచ్చింది. అయితే అదే గ్రీన్ లైన్ సమస్య వన్ ప్లస్ నార్డ్ 4 లో తలెత్తింది.

మరోవైపు వన్ ప్లస్ రీసెంట్ గా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్స్ తో వన్ ప్లస్ నార్డ్ 4 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ విడుదల చేసింది. దీంతో యూజర్లకు వన్ ప్లస్ నార్డ్ 4, వన్ ప్లస్ నార్డ్ సిఈ 4 లైట్ 4జీ స్మార్ట్ ఫోన్లు ఏఐ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి.

ఈ కొత్త ఏఐ స్మార్ట్ ఫోన్లలో సైడ్ బార్ లో ఒక ఏఐ టూల్ కిట్ ఉంటుంది. అందులోని ఏఐ ఫంక్షన్ నింగ్ కేవలం అవసరమైనప్పుడు మాత్రమే అపియర్ అవుతుంది. ఉదాహరణకు ఫోన్ లోని ఏఐ స్పీక్ ఫీచర్ ఒక వెబ్ పేజ్ లో కనీసం ఉండాల్సిన టెక్స్ ట్ ఉన్నప్పుడే పనిచేస్తుంది.

జూలై నెలలోనే ఈ ఏఐ ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్లు లాంచ్ ప్లాన్ చేసుకున్న వన్ ప్లస్ కంపెనీ.. డివైస్ లో ఏఐ ఫీచర్లు పొందుపరచడానికి టెక్నికల్ గా ఆలస్యం కావడంతో ఆగస్టు లో లాంచ్ చేసింది. కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం.. నార్డ్ సిఈ 4 లైట్ 4జీ స్మార్ట్ ఫోన్లు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. అదే నార్డ్ 4 స్మార్ట్ ఫోన్లు .. యూరోప్, ఇండియా, ఏషియా పసిఫిక్, మిడిల్ ఈస్ట, ఆఫ్రికా, రష్యా, లాటిన్ అమెరికా, సౌత్ ఏషియా దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.

Also Read:  నెలకు రూ.1.28 కోట్లు ఆఫీస్ రెంటు!.. బ్లాక్ రాక్ కంపెనీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×