BigTV English

Harshit Rana Flying Kiss: హర్షిత్ రాణా ఓవరాక్షన్.. బీసీసీఐ రియాక్షన్ అదుర్స్..!

Harshit Rana Flying Kiss: హర్షిత్ రాణా ఓవరాక్షన్.. బీసీసీఐ రియాక్షన్ అదుర్స్..!
Harshit Rana Flying Kiss
Harshit Rana Flying Kiss

Harshit Rana Flying Kiss: ఐపీఎల్ మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. అయితే కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ నువ్వా నేనా? అన్నట్టు సాగింది. ఓ దశలో కోల్‌కతా 14 ఓవర్లకు 119/6 స్కోరు మాత్రమే చేసింది. కానీ ఆండ్రూ రసెల్ వచ్చిన తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. తను 25 బాల్స్ లో 7 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. మధ్యలో రింకూ కూడా 15 బంతుల్లో 23 పరుగులు చేశాడు. మొత్తానికి కోల్ కతా 20 ఓవర్లలో 208 పరుగుల భారీ స్కోరు చేసింది.


అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (63; 29 బంతుల్లో) గొప్ప పోరాటం వృథాగా మారింది. క్లాసెన్ 8 సిక్సర్లు కొట్టాడు.

అయితే ఆఖరి ఓవర్ లోనే హైడ్రామా మొదలైంది. 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
హైదరాబాద్ ఆత్మవిశ్వాసంతో కనిపించింది. హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తున్నాడు. తొలి బంతిని క్లాసెన్ సిక్స్ కొట్టాడు.
ఆ తర్వాతి అయిదు బంతుల్లో హర్షిత్ రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. కోల్ కతాకి విజయాన్ని అందించాడు.


Also Read: KKR vs SRH: క్లాసెన్ వీరోచిత ఇన్నింగ్స్ వృథా.. పోరాడి ఓడిన హైదరాబాద్..

ఇక్కడే మ్యాచ్‌లో హర్షిత్ రాణా ఓవరాక్షన్ చేశాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (32; 21 బంతుల్లో)ను, హెన్రిచ్ క్లాసెన్‌ను ఔట్ చేసిన సమయంలో హర్షిత్ అతిగా ప్రవర్తించాడు. అవుట్ అయి విచారంగా వెళుతున్న మయాంక్‌ దగ్గరగా వచ్చి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీనికి మయాంక్ సీరియస్ గా చూస్తే, తను కూడా అంతకన్నా సీరియస్ గా గుడ్లు ఉరుముతూ చూశాడు.

ఇది సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. తర్వాత ఆఖర్లో క్లాసెన్ అవుట్ అయి వెళ్లేటప్పుడు కూడా ఆవేశంగా బయటికి వెళ్లు అంటూ వేలు పెట్టి చూపించాడు. ఇవన్నీ దగ్గరుండి చూస్తున్న మ్యాచ్ రిఫరీకి వళ్లు మండింది. రూల్స్ బుక్ తీశాడు. ఆర్టికల్ 2.5 ప్రకారం హర్షత్ రెండు లెవల్-1 నేరాలకు పాల్పడ్డాడని నిర్ధారించారు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 10%,50% మొత్తం 60 శాతం జరిమానా విధించినట్లు తెలిపారు.

Related News

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×