BigTV English

Harthik Pandya : బాల్ కి మంత్రోపదేశం.. హార్థిక్ పాండ్యా క్లారిటీ..

Harthik Pandya : బాల్ కి మంత్రోపదేశం.. హార్థిక్ పాండ్యా క్లారిటీ..
Harthik Pandya

Harthik Pandya : ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో మరో ఛమక్కు జరిగింది. టాస్ ఓడి పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తోంది. 12 వ ఓవర్ జరుగుతోంది. అప్పటికి బాబర్ అజమ్, ఇమామ్ ఉల్ హక్ ఆడుతున్నారు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తున్నాడు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కావాలంటే ఒక వికెట్ పడాలి. ఎందుకంటే అప్పటికే 12 ఓవర్ వచ్చేసింది. ఒక బ్రేక్ కావాలి. ఒకవైపు నుంచి హార్దిక్ కి ఫోర్లు రూపంలో బాగానే వారు వడ్డిస్తున్నారు.


దీంతో హార్దిక్ ఏం చేశాడంటే బాల్ వైపు చూసి తనలో తను ఏదో మాట్లాడుకున్నాడు. అలా వేసేసరికి ఠపీ మని వికెట్ వచ్చేసింది. ఇది చూసిన నెటిజన్లు సరదాగా ఏమంటున్నారంటే…పాండ్యా ఏదో మంత్రం వేశాడు…అందుకే వికెట్ వచ్చిందని చెబుతున్నారు. దానికి పాండ్యా మాట్లాడుతూ ఏదో నన్ను నేనే చైతన్యం చేసుకున్నాను. సరైన చోట బాల్ పడాలని నాకు నేను చేసుకున్న సెల్ఫ్ మోటివేషన్ అదని అన్నాడు.

చాలామంది అనడం ఏమిటంటే, నిజంగా హార్దిక్ పాండ్యాకి మంత్రాలే వస్తే, బాల్ కో వికెట్టు పడాలని అనుకుంటాడు కానీ, కరెక్ట్ ప్లేస్ లో పడాలని అనుకోడు కదా అంటున్నారు…అలాగే 10 బాల్స్ లో పది వికెట్లు రావాలని మంత్రాలు వేసేస్తే అసలు గొడవే ఉండదు కదాని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు… ఇలాంటి అమ్మలక్కల కబుర్లతో ఊసులెట్టవద్దని కొందరు సీరియస్ గా వార్నింగులు ఇస్తున్నారు.
కరెక్టే కదా…నిజంగా మంత్రాలే వస్తే, 191 రన్స్ పాకిస్తాన్ ఎందుకు చేయాలి? ఇండియా అంత చెమటోడ్చి కష్టపడి గెలవాల్సిన అవసరం ఏముంది అని మరికొందరు అంటున్నారు.


అయితే ఈ మ్యాచ్ లో ఆరు ఓవర్లు వేసిన పాండ్యా 34 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. నిజంగా మంత్రాలే వేస్తే, ఆ 34 పరుగులు ఎందుకిస్తాడని కూడా అంటున్నారు. ఏదేమైనా ఆట ఒక్కటే కాదు..గ్రౌండ్ లో ఆటగాళ్లు ఏం చేస్తున్నా…సామాజిక మాధ్యమాలు వేయికళ్లతో చూస్తున్నాయని అంతా గ్రహించాలని విశ్లేషకులు చెబుతున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×