BigTV English
Advertisement

IND VS NZ Final: టీమిండియాకు గుడ్ న్యూస్..ఫైనల్ ఆడుతున్న కోహ్లీ.. జట్ల వివరాలు ఇవే ?

IND VS NZ Final: టీమిండియాకు గుడ్ న్యూస్..ఫైనల్ ఆడుతున్న కోహ్లీ.. జట్ల వివరాలు ఇవే ?

IND VS NZ Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఉత్కంఠ భరితమైన పోరు జరగబోతోంది. అయితే ఈ కీలక మ్యాచ్ కి ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలికి గాయం అయ్యిందని, అతడు ఫైనల్ మ్యాచ్ కి దూరం కాబోతున్నాడు అంటూ కొన్ని రూమర్స్ వెలువడ్డాయి.


 

కానీ తాజాగా బీసీసీఐ ఈ వార్తలకు చెక్ పెట్టింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడతాడని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో భారత ఇన్నింగ్స్ ని గిల్, రోహిత్ శర్మలు ప్రారంభిస్తారు. ఇక వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా తదుపరి బ్యాటింగ్ చేస్తారు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో మరోసారి రిషబ్ పంత్ బెంచ్ కే పరిమితం కానునట్లు తెలుస్తోంది.


గత రెండు మ్యాచ్లలో భారత జట్టు ఎటువంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో బలమైన న్యూజిలాండ్ జట్టును ఎదుర్కొనేందుకు ఈ మ్యాచ్ లో కూడా భారత్ అదే జట్టుతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటి ఆల్రౌండర్లు జట్టులో ఉండడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. అలాగే పిచ్ బౌలింగ్ కి అనుకూలంగా ఉండడంతో స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయాలని టీమిండియా యోచిస్తోంది.

దీంతో ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ టోర్నీలో గ్రూప్ ఎలో ఈ ఇరుజట్లు మొదటి రెండు స్థానాలలో నిలిచాయి. న్యూజిలాండ్ – భారత్ మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ చేరుకున్నప్పటికీ.. న్యూజిలాండ్ జట్టు గ్రూప్ దశలో భారత్ పై ఓటమిని చవిచూసింది.

ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రానించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక భారత జట్టు విజయాన్ని అడ్డుకునే ఆటగాళ్లు న్యూజిలాండ్ జట్టులో ఉన్నారనేది వాస్తవం. రచిన్ రవీంద్ర ఫామ్ ని పరిశీలిస్తే.. అతడు మిడిల్ ఆర్డర్లో భారత్ ని వెంటాడే అవకాశం ఉన్న ఆటగాళ్లలో ఒకడు. ఇక బౌలింగ్ విషయంలో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 10 ఓవర్ల స్పీడ్ మాయాజాలం న్యూజిలాండ్ జట్టుకు ప్లస్ కావచ్చు.

 

ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో పోటీపడే ఇరుజట్ల వివరాలు చూస్తే.. భారత్: రోహిత్ శర్మ {కెప్టెన్}, గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యార్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. న్యూజిలాండ్: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్ సన్, డారియల్ మిచెల్, టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రాస్ వెల్, శాంట్నర్, జేమీసన్, మ్యాట్ హెన్రీ, విలియం ఓరూర్కే.

Tags

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×