BigTV English
Advertisement

Pushpa 2: ఆస్కార్ బరిలోకి పుష్ప రాజ్… RRR కంటే భారీగా ఖర్చు.. ఎన్ని కోట్లంటే?

Pushpa 2: ఆస్కార్ బరిలోకి పుష్ప రాజ్… RRR కంటే భారీగా ఖర్చు.. ఎన్ని కోట్లంటే?

Pushpa 2.. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు ఆస్కార్ టార్గెట్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గత రెండేళ్ల క్రితం రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’సినిమా కూడా ఆస్కార్ దిశగా అడుగులు వేసింది. అయితే అక్కడ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో చంద్రబోస్ (Chandrabose ) కి, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ .కీరవాణి (MM.Keeravani) కి ఆస్కార్ అవార్డు లభించాయి. ఇక ఈసారి కూడా ఆస్కార్ నామినేషన్ లో ఛాన్స్ దక్కించుకోవడానికి మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు పుష్ప 2 కూడా ఆస్కార్ నామినేషన్ లో ఛాన్స్ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


ఆస్కార్ నామినేషన్ తర్వాతే అసలు కథ..

ఇకపోతే సినిమా తీసే ప్రతి ఒక్కరి కల ఎప్పటికైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని ఉంటుంది. అటు ప్రపంచం మొత్తం గుర్తించిన సినిమాలకు అకాడమీ అవార్డులు కూడా అందిస్తారు. జీవితంలో ఒక్క ఆస్కార్ అయినా సాధిస్తే చాలని కృషి చేసిన వాళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఆస్కార్ అనేది అంత ఈజీ విషయం ఏమీ కాదు. ముందు ఆస్కార్ నామినేషన్స్ లో ఛాన్స్ దక్కించుకోవడానికి ఎంతో కష్టపడాలి. ఆ తర్వాత నామినేషన్స్ వేసిన తర్వాత అసలు సినిమా మొదలవుతుంది. ముఖ్యంగా ఆస్కార్ నామినేషన్ తర్వాత అవార్డు ప్రధానోత్సవం వరకు సినిమాను ఒక రేంజ్ లో ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అకాడమీ అవార్డు కోసం.. సినిమా సెలెక్ట్ అయ్యేందుకు చాలా ప్రీమియర్ షో లు కూడా వేయాలి. అంతేకాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రమోషన్స్, ఈవెంట్స్, ఇంటర్వ్యూలు.. అబ్బో అదంతా చాలా పెద్ద కథ.


IIFA Digital Awards 2025: ఐఫా డిజిటల్ అవార్డ్స్ గ్రహీతలు వీరే.. ఎవరెవరంటే..?

RRR కంటే పుష్ప 2 కోసం భారీ ఖర్చు..

ఆస్కార్ కి నామినేట్ అవ్వడం వరకు ఒకే కానీ.. ఆ తర్వాత సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లడమే అసలు కథ. ఇటీవల జరిగిన 97వ అకాడమీ అవార్డుల్లో ఆస్కార్ గెలుచుకున్న సినిమాలు కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ స్టేజ్ కు వచ్చాయి. అనోరా సినిమా ఏకంగా రూ.149 కోట్లు ఖర్చు చేస్తే.. బ్రుటలిస్టు రూ.83 కోట్లు ఖర్చు చేయగా.. కాంక్లేవ్ సినిమాకి ఏకంగా రూ.166 కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా కేవలం ఆస్కార్ ప్రమోషన్స్ కోసం మాత్రమే ఖర్చు చేశారని సమాచారం.అంతెందుకు ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా ఏకంగా ఆస్కార్ ప్రమోషన్స్ కోసమే రాజమౌళి రూ.80 కోట్ల వరకు ఖర్చు చేశాడని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆస్కార్ కి నెక్స్ట్ ఛాన్స్ ఉన్న సినిమాలు ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సిద్ధం అవ్వాలి. గత సంవత్సరం పుష్ప2 పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై సెన్సేషనల్ హిట్ అయింది. ఆస్కార్ నామినేషన్ లో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అలా చేస్తే పుష్ప2కి సుమారుగా రూ.200 కోట్లు చేసినా.. ఆస్కార్ ప్రమోషన్స్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎలాగూ ఈ సినిమాకి రూ.1800 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి అకాడమీ అవార్డుల్లో కూడా ఏదో అవార్డు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. అందుకే ఆస్కార్ ప్రమోషన్స్ కి పుష్ప మేకర్స్ కూడా ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తనికైతే పుష్ప2, ఆర్ఆర్ఆర్ కి మించి ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×