Gill- Fatima : సాధారణంగా సెలబ్రిటీల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ శుబ్ మన్ గిల్ ఈ మధ్య కాలంలో నిత్యం వార్తల్లో నిలవడం విశేషం. ఇటీవలే టీమిండియా కి టెస్ట్ కెప్టెన్ గా, టీ-20 జట్టుకి వైస్ కెప్టెన్ గా ఎంపికైన గిల్.. ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ లేని లోటును తీరుస్తున్నాడు. తాజాగా శుబ్ మన్ గిల్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. శుబ్ మన్ గిల్ అచ్చం తనలా ఉన్న ఓ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఆ హీరోయిన్ ఎవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : Asia Cup 2025 : బుమ్రాకు వార్నింగ్… వాడి బౌలింగ్ లో 6 సిక్సర్లు కొడతా!
ఆ హీరోయిన్ మరెవ్వరో కాదండోయ్.. ఫాతిమా సనా షేక్. అయితే ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ” నేను క్రికెటర్ శుబ్ మన్ గిల్ మాదిరిగా కనిపిస్తున్నాను అని చాలా మంది చెప్పారు. నేను అతని ఫొటో చూసినప్పుడు వారందరూ సరైన వారే అని భావిస్తున్నా” అని తెలిపారు ఫాతిమా ప్రస్తుతం ఫాతిమా చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఫాతిమా గతంలో ఓ ప్రేమ వివాదంలో కూడా చిక్కుకుంది. ఫాతిమా, విజయ్ వర్మ గతంలో ప్రేమలో ఉన్నట్టు రూమర్స్ వినిపించాయి. తాజాగా గిల్ తో ఉన్నట్టు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం గమనార్హం. ఫాతిమా, విజయ్ వర్మల ప్రేమ గురించి గతంలో క్లారిటీ ఇచ్చింది ఫాతిమా. ముఖ్యంగా ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ సమాన గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని.. ఒకరు చెప్పేది మరొకరూ వినాలంటూ కామెంట్ చేసింది. అంతేకాదు.. ప్రేమలో ఉన్నప్పుడు అవసరం అయితే కొన్నిసార్లు ఒకరి కోసం మరొకరూ కాంప్రమైజ్ కావాలని చెప్పింది. మీ ఐడెంటిటినీ కోల్పోకుండా ఎదుటివారితో మీకు ఉన్న అనుబంధాన్ని ముందుకు నడిపించాలి.
అప్పుడే ఆ బంధం బలంగా నిలబడుతుంది. నా జీవితంలో అలా ఆలోచించే వ్యక్తి ఎవ్వరూ లేరు. బహుశా సినిమా కథల్లో అలాంటి వారు ఉంటారేమో.. కానీ నిజజీవితంలో లేరుష అని చెప్పుకొచ్చింది. దీంతో ఫాతిమా, విజయ్ వర్మల ప్రేమ లేదని ఓ క్లారిటీ అయితే వచ్చింది. అయితే అప్పట్లో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపించడం విశేషం. క్రికెటర్ శుబ్ మన్ గిల్ గత కొంత కాలంగా సారా టెండూల్కర్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే గత నెలలో శుబ్ మన్ గిల్ కి సారా టెండూల్కర్ రాఖీ కట్టడంతో అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయినప్పటికీ ఆసియా కప్ 2025లో శుబ్ మన్ గిల్ బ్యాటింగ్ చేసేటప్పుడు సారా సందడి చేయడం విశేషం. మళ్లీ మరోసారి వీరిపై వార్తలు వినిపించడం గమనార్హం.