Boat accident: కాంగో దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య కాంగోలోని ఎక్వాట్యూర్ ప్రావిన్స్ లో పడవ బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 86 మంది మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది స్టూడెంట్సే ఉన్నట్టు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో సెప్టెంబర్ 10న బుధవారం రోజున జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
సామర్థ్యానికి మించి ప్రయాణికులు పడవలో ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అలాగే రాత్రి పూట ప్రయాణించడంతో సమస్యను గుర్తించలేకపోయినట్టు కూడా సమాచారం. ఈ ఘటనపై పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. కాంగాలో తరుచుగా బోట్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కొంచెం పాడైన పడవలను కూడా వాడడం, భద్రతా ప్రమాణాలను అంతగా పాటించకపోవడం, ప్రయాణికులు ఎక్కువగా ఎక్కడం.. లాంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
ALSO READ: Hyderabad Metro: ఈ మెట్రోను మేము నడపలేం.. సమస్యను పరిష్కరించండి బాబోయ్..