BigTV English

The Raja Saab :ప్రభాస్ సినిమాపై హైకోర్టులో కేసు… 218 కోట్ల మోసం?

The Raja Saab :ప్రభాస్ సినిమాపై హైకోర్టులో కేసు… 218 కోట్ల మోసం?

The Raja Saab :రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన చేతిలో దాదాపు 5 ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పవచ్చు. అందులో మొదటిది ‘ది రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa prasad) సుమారుగా రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మారుతి(Maruti ) దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఇందులో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) రిద్ధీ కుమార్ (Riddhi Kumar), మాళవిక మోహనన్ (Malavika mohanan). ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సంజయ్ దత్ (Sanjay Dutt) తో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. హార్రర్ కామెడీ మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.


ది రాజాసాబ్ సినిమాపై హైకోర్టులో కేస్ ఫైల్..

వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ వీఎఫ్ఎక్స్ తో పాటు ఇతర పనుల వల్ల ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి మరో సమస్య ఎదురయిందని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమాపై హైకోర్టులో కేసు వేయడం సంచలనంగా మారింది. అసలే విడుదలకు ఆలస్యం అవుతున్న వేళ.. ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో కేసు అంటే అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కానీ అటు టాలీవుడ్ లో సమ్మె నడుస్తున్న కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా నిర్మాతలపై ఢిల్లీకి చెందిన IVY ఎంటర్టైన్మెంట్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.


రూ. 218 కోట్ల భారీ మోసం..

IVY ఎంటర్టైన్మెంట్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం.. “ఈ సంస్థ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా కోసం ఏకంగా రూ.218 కోట్లు పెట్టుబడిగా పెట్టిందట. ఇందుకుగానూ ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులను కూడా ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. పైగా సినిమాని ఎలాంటి పోటీ లేని సమయంలోనే సింగిల్ రిలీజ్ గా వచ్చేలా చూడాలని కూడా అనుకున్నారట. కానీ షూటింగ్ ఇప్పటివరకు అవ్వలేదు. పైగా అటు సినిమా అప్డేట్స్ కూడా లేవు. తాము అనుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారని, సినిమాను వాయిదా వేస్తున్నారని ఐ వి వై ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆరోపించింది.

18% వడ్డీతో చెల్లించాలి..

అంతేకాదు తాము కూడా అప్పుచేసి ఈ సినిమా కోసం పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం తాము వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, కాబట్టి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ 18% వడ్డీతో కలిపి తాము పెట్టిన పెట్టుబడికి చెల్లించాలని.. అంతవరకు ఈ సినిమాపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఎటువంటి హక్కులు ఉండవు అంటూ సినిమా టైటిల్ ను దోపిడీ చేయకుండా నిరోధించాలని కూడా ఆ పిటిషన్ లో కోరింది.

టెన్షన్లో చిత్ర బృందం…

ఇక దీంతో ఈ విషయం సర్వత్ర ఉత్కంఠ గా మారింది. మరి ఢిల్లీ హైకోర్టు దీనిపై ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. మొత్తానికైతే ఇప్పుడు హైకోర్టులో కేసు వేయడంతో పీపుల్ మీడియా నిర్మాణ సంస్థ ఈ విషయంపై ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి అని అటు సినీ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. కనీసం ప్రభాస్ అయిన దీనిపైన స్పందిస్తారేమో చూడాలి.

ALSO READ:Tollywood: 50 సెకండ్ల యాడ్ కోసం రూ.5 కోట్లు.. ఈమెకు స్టార్ హీరోలకు మించి డిమాండ్!

Related News

Betting App Case: ఈ రోజు మంచు లక్ష్మీ వంతు… విచారణపై ఉత్కంఠ!

Film industry: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

Tollywood: 50 సెకండ్ల యాడ్ కోసం రూ.5 కోట్లు.. ఈమెకు స్టార్ హీరోలకు మించి డిమాండ్!

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అకౌంట్ లోకి మరో బిగ్ బ్రాండ్..

War 2 : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆ

Big Stories

×