BCCI : సాధారణంగా క్రికెట్ (Cricket) లో రకరకాల రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆటగాళ్లను సెలెక్టర్ల కమిటీ ఎంపిక చేస్తుంది. అయితే ఏ ఆటగాడు ఎంపిక కావాలన్నా..? ఆ ఆటగాడు తమ ప్రతిభను కనబరచాలి. సెలక్షన్ కమిటీ వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని జట్టును ప్రకటిస్తుంది. ఇదంతా మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం.కానీ ఆసియా కప్ కి టీమిండియా (Team india) కీలక బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) , కీలక బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ని సెలెక్ట్ చేయకపోవడం పై సెలక్షన్ కమిటీ, బీసీసీఐ (BCCI) పై పలువురు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు సెలక్టర్లను బీసీసీఐ ఎలా నియమించుకుంటుంది. వారికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి..? వారి యొక్క విధులు, బాధ్యతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సెలక్షన్ కమిటీ విధులు, బాధ్యతలు :
సభ్యులకు ఉండాల్సిన అర్హతలు :
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ప్రకటన తీవ్ర వివాదాలకు దారితీసింది. శ్రేయాస్ అయ్యర్‌ను మినహాయించడం పై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. భారత మాజీ కెప్టెన్ , BCCI మాజీ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్.. అగార్కర్ పై విమర్శలు గుప్పించారు. దేశంలో అత్యంత ఫామ్‌లో ఉన్న బ్యాటర్లలో ఒకరిని వదిలివేయడం వెనుక ఉన్న తర్కాన్ని ప్రశ్నించారు. IPL 2025లో పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహించిన అయ్యర్.. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో గైర్హాజరైన వారిలో ఒకరు. ముఖ్యంగా అతను ఐదుగురు సభ్యుల రిజర్వ్‌లలో కూడా చేర్చబడకపోవడం గమనార్హం. అక్కడ ధ్రువ్ జురెల్‌ను మూడవ వికెట్ కీపర్‌గా ఎంచుకున్నారు. అయ్యర్‌ను జట్టులోకి తీసుకోవడంలో మరొకరిని తొలగించకుండా సవాల్ ఉందని పేర్కొంటూ అగార్కర్ తన పిలుపును సమర్థించుకున్నాడు.
?igsh=emV3NTNmbGFqMzNz