EPAPER

WTC 2025: బంగ్లా చిత్తు.. WTC ఫైనల్‌కు చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

WTC 2025: బంగ్లా చిత్తు.. WTC ఫైనల్‌కు చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

 


How many matches should Team India win to reach the WTC final: టెస్టుల్లో టీమిండియాకు తిరుగులేకుండా పోతోంది. టాప్ క్లాస్ ఆటతీరుతో ప్రత్యర్థుల పనిని పడుతుంది. ఇప్పటికిప్పుడు భారత్ ను ఢీ కొట్టాలంటే ప్రత్యర్థి జట్లు భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బంగ్లాదేశ్ తో రెండు మ్యాచ్ల సిరీస్ ను రోహిత్ సేన మరో లెవెల్ చూపిస్తోంది. వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ కాన్పుర్ లో టెస్టుల్లో అద్భుతమైన ఫలితాలను అందుకుంది. సిరీస్ లో 2-0 తేడాతో సమం చేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్ లో టాప్ ప్లేస్ ను పదిలం చేసుకుంది. భారత జట్టు ఫైనల్ చేరాలంటే మరో మూడు మ్యాచ్లు గెలిస్తే సరిపోతుందని ఎక్స్పర్ట్ అంచనాలు వేస్తున్నారు.

ఇతర జట్ల ఫలితంతో సంబంధం లేకుండా టైటిల్ పోరుకు అర్హత సాధించవచ్చని అంటున్నారు. ప్రస్తుత సర్కిల్స్ లో భారత జట్టు స్వదేశంలోనే ఇంకా మూడు టెస్టులు ఆడాలి. న్యూజిలాండ్ తో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ లలో టీమిండియానే హాట్ ఫేవరెట్ గా మారుతుంది. న్యూజిలాండ్ కూడా గట్టి పోటీని ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కనీసం ఒక్క మ్యాచ్ అయినా డ్రా చేసుకోవడం కూడా కివీస్ కు కష్టమేనని అంచనాలు అందుకున్నాయి. న్యూజిలాండ్ పై మూడు టెస్టులు గెలిస్తే టీమిండియాకు అసలు తిరిగే ఉండదు. ఆస్ట్రేలియాతో భారత్ 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు టెస్టులు కంగారు గడ్డపైనే ఉండనున్నాయి.


అక్కడ ఫలితం తేడా వచ్చినప్పటికీ పెద్దగా ఎఫెక్ట్ ఏమీ పడదు. వారి పాయింట్ల పట్టికలో టాప్-2లో గెలిస్తే ఫైనల్ కు చేరతాయి. అగ్రస్థానంలో కొనసాగేందుకు భారత జట్టుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పటివరకు ఆడిన రెండు సర్కిల్స్ లలో టీమిండియా రెండుసార్లు ఫైనల్ చేరింది. కాకపోతే ఒకసారి కూడా టైటిల్ అందుకోలేదు. ప్రస్తుత సర్కిల్స్ లో భారత జట్టు ఇప్పటివరకు 11 మ్యాచులలో బరిలోకి దిగింది. 8 మ్యాచులలో విజయం సాధించింది. రెండు మ్యాచులలో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. విజయాల శాతం 74.24. ఆస్ట్రేలియా 12 మ్యాచ్లలో 8 మ్యాచులు గెలిచింది. మూడు మ్యాచ్లు ఓటమిపాలైంది. ఒక మ్యాచ్ డ్రా అయ్యింది. విజయాల శాతం 62.50. శ్రీలంక 9 మ్యాచ్లు ఆడింది. ఐదు మ్యాచ్లు గెలిచింది.

 

Also Read: Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ… సిరీస్ మనదే.. బంగ్లా నాగిని డాన్స్ కు బ్రేకులు!

నాలుగు టెస్టులు ఓడింది. విజయాల శాతం 55.56. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో శ్రీలంక మూడవ స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ 16 మ్యాచ్లను ఆడింది. ఎనిమిది మ్యాచ్లు గెలిచి ఏడు మ్యాచులలో ఓటమి పాలయింది. ఒక టెస్టు డ్రాగా ముగిసింది. విజయాల శాతం 42.19. ఆరు మ్యాచ్లు ఆడిన సౌత్ ఆఫ్రికా రెండు మ్యాచ్లు గెలిచింది. మూడు మ్యాచ్లలో ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. విజయాల శాతం 38.89. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఎనిమిది టెస్టులలో మూడు చొప్పున గెలిచాయి. కివీస్ ఆరవ స్థానంలో, బంగ్లాదేశ్ ఏడవ స్థానంలో ఉన్నాయి. ఏడు టెస్టుల్లో రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచిన పాకిస్తాన్ ఎనిమిదవ స్థానంలో నిలిచింది. తొమ్మిది మ్యాచ్లలో ఒకే మ్యాచ్ గెలిచిన వెస్టిండీస్ తొమ్మిదవ స్థానంలో ఉంది.

Related News

Ind vs Ban T20i : భారత్ క్లీన్ స్వీప్… మూడో టీ20లోనూ ఘన విజయం, సిరీస్ కైవసం

India vs Bangladesh : సంజు ఫాస్టెస్ట్ సెంచురీ.. ఆ ఒక్క ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు, బంగ్లా బెంబేలు!

Ind vs Ban T20: ఉప్పల్‌‌లో టీమ్ ఇండియా ఉతుకుడు.. బంగ్లాకు భారీ టార్గెట్, ఆ వరల్డ్ రికార్డు జస్ట్ మిస్!

Ind Vs Nz: న్యూజిలాండ్ సిరీస్ కోసం టీమిండియా జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్ గా అతడికి చాన్స్!

Ajay Jadeja Jamnagar: ఆ రాజ్యానికి వారసుడిగా క్రికెటర్ అజయ్ జడేజా.. అధికారికంగా ప్రకటించిన రాజుగారు

Ind vs Ban: ఇవాళ హైదరాబాద్ లో మూడో టి20.. తెలుగు ప్లేయర్లకు అవకాశం!

Mohammad Siraj: మహమ్మద్ సిరాజ్‍‌కు DSP పోస్ట్..!

Big Stories

×