BigTV English

Mohammed Siraj: సి’రాజ్’.. ప్రధాన పేసర్ అతడే!?

Mohammed Siraj: సి’రాజ్’.. ప్రధాన పేసర్ అతడే!?

Mohammed Siraj: టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ రోజరోజుకు రాటుదేలుతున్నాడు. కొత్త ఎత్తుగడలతో పవర్ ప్లేలో వికెట్లు తీస్తున్నాడు. జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నాలుగేళ్ల కిందట జట్టులోకి వచ్చిన సిరాజ్ వేరు.. ప్రస్తుతం ఆడుతున్న సిరాజ్ వేరు. వికెట్లు తీయడమేగాక.. ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నాడు.


సిరాజ్ ఆటకు ఫిదా అయిపోయి స్టార్ ఆటగాళ్లు సైతం అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో కోహ్లీతో సమంగా సిరాజ్ రాణించాడని.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను ఇద్దరికీ ఇచ్చి ఉండాల్సిందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. సిరాజ్‌లో చాలా మార్పులు వచ్చాయని, రోజురోజుకు రాటుదేలుతున్నాడని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసించారు. పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోయే సమస్యను సిరాజ్ పోగొట్టాడని అభిప్రాయపడ్డారు.

నిన్న మెన్నటి వరకు టీమిండియా ప్రధాన పేసర్ ఎవరంటే జస్పీృత్ బూమ్రా పేరు వినిపించేది. కానీ అతడు గాయాల కారణంగా ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో ఇప్పుడు పేసర్ మహమ్మద్ సిరాజ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అన్ని ఫార్మాట్లలోనూ ఆడగల సత్తా ఉన్నది సిరాజ్‌లోనే. అంతగా నిలకడగా రాణిస్తున్నాడు ఈ హైదరాబాదీ ఆటగాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు. సిరాజ్ ఇదే దూకుడును కొనాసాగిస్తే ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌లో మరింత పదును దేలిన ఆయుధం అవుతాడు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×