BigTV English
Advertisement

Sachin comments : ‘ఆ విషయం నాకు అర్థం కావట్లేదు’.. ఇండియా ఓటమిపై సచిన్ కామెంట్స్..

Sachin comments : ‘ఆ విషయం నాకు అర్థం కావట్లేదు’.. ఇండియా ఓటమిపై సచిన్ కామెంట్స్..
Sachin comments


Sachin comments : ఫేవరెట్ ప్లేయర్స్‌ను ప్రోత్సహించే విషయంలో, ఒకవేళ వారు తప్పు చేస్తే వారిని ద్వేషించే విషయంలో.. ఇలా అన్నింటిలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ముందుంటారు. ఒక్క సీనియర్ ప్లేయిర్ గ్రౌండ్‌లో కనిపించకపోతే.. దానిపై కూడా విమర్శలు మొదలుపెడతారు. తాజాగా ఇండియన్ క్రికెట్ టీమ్‌లో మంచి ఆఫ్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక కాకపోవడంపై కూడా ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియాతో తలబడిన ఇండియా ఓటమిని ఒప్పుకోక తప్పలేదు. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. క్రికెట్ నిపుణులు కూడా టీమ్‌పై విమర్శలు మొదలుపెట్టారు. అసలు టీమ్ ముందు నుండే సరిగా ఆడడం లేదని కొందరు అంటుంటే.. టీమ్ సెలక్షన్ బాగా లేదని మరికొందరు అంటున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేయకపోవడంపై కోచ్ రాహుల్ డ్రావిడ్ స్పందించారు. పలు కారణాల వల్ల రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేసుకోలేకపోయామని అన్నారు. ఈ కామెంట్స్‌పై, ఇండియా ఓటమిపై సచిన్ టెండూల్కర్ స్పందించారు.


ముందుగా ఇండియాపై ఆస్ట్రేలియా గెలుపును సచిన్ ట్విటర్ ద్వారా ప్రశంసించారు. డబ్ల్యూటీసీ ఫైనల్ విన్ అయినందుకు ఆస్ట్రేలియా టీమ్‌కు కంగ్రాట్స్ అని తెలిపారు. స్టీవ్ స్మిత్, ట్రావిష్ హెడ్.. మొదటిరోజులోనే ఆటను తమవైపు తిప్పుకునే ప్రదర్శనను కనబరిచారని అన్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌ నుండే ఇండియా బ్యాటింగ్ ఫార్మ్ బలంగా ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. ఈ ఆటలో భారత్ కూడా అక్కడక్కడా మూమెంట్స్‌తో మెప్పించినప్పటికీ ప్రపంచంలోనే నెంబర్ వన్ టెస్ట్ బౌలర్ అయిన అశ్విన్‌ను టీమ్‌లోకి ఎందుకు తీసుకోలేదో అర్థం కాలేదని తన అసంతృప్తిని బయటపెట్టారు.

ప్రస్తుతం జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ మ్యాచ్‌లో పిచ్.. స్పిన్నర్స్ కంటే సీమర్లకే ఎక్కువగా సహకరించేలా ఉంది కాబట్టి అశ్విన్‌ను తీసుకోలేదని డ్రావిడ్ చెప్పిన కామెంట్స్‌ను గుర్తుచేసుకున్నారు సచిన్. నైపుణ్యం ఉన్న స్పిన్నర్లకు ట్రాక్‌లపై ఆధారపడకుండా, తమ స్ట్రాటజీలను ఉపయోగిస్తారని అన్నారు. పైగా ఆస్ట్రేలియాకు చెందిన టాప్ 8 బ్యాటర్లలో అయిదుగురు లెఫ్ట్ హ్యాండర్లు కావడంతో అశ్విన్‌కు అవకాశం వచ్చుంటే టీమ్‌ పర్ఫార్మెన్స్ మరింత బాగుండేదేమో అని సచిన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో మరోసారి డ్రావిడ్, సచిన్.. ఒకే మాటపై నిలబడే వ్యక్తులు కాదని తేలిందని క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Related News

CP Sajjanar : వీళ్లేం సెల‌బ్రిటీలు?…రైనా, ధావన్‌లపై స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

Cm Revanth Reddy: హైదరాబాద్ లో మ‌రో అంత‌ర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా త‌ర‌హాలో బౌన్సీ పిచ్ లు

BBL New Rule : BBLలో కొత్త రూల్స్‌…ఇకపై బంతి తాకితే అభిమానుల‌కే, త్వ‌ర‌లో ఐపీఎల్ లో కూడా

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

Shivam Dube: హ‌ర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బ‌ల‌వంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్‌

Big Stories

×