BigTV English

Latest News on Prabhu Deva : 50 ఏళ్ల వయసులో తండ్రైన ప్రభుదేవా..

Latest News on Prabhu Deva : 50 ఏళ్ల వయసులో తండ్రైన ప్రభుదేవా..
Father Prabhu Deva at the age of 50.


Latest News on Prabhu Deva : ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి, పిల్లలకు జన్మనివ్వడానికి.. వయసుతో సంబంధం ఏముంది అని ఈరోజుల్లో చాలామంది నిరూపించడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో దీనికి చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. తాజాగా 50 ఏళ్ల నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ కూడా తండ్రి అయ్యి తన సంతోషాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. అతడు మరెవరో కాదు.. ఇండియన్ మైఖెల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా.

ప్రభుదేవా డ్యాన్స్‌ను చూసి తనకు ఇండియన్ మైఖెల్ జాక్సన్ అని ప్రేమగా పేరుపెట్టుకున్నారు ఫ్యాన్స్. కేవలం డ్యాన్స్ విషయంలోనే కాదు నటుడిగా, దర్శకుడిగా కూడా తన సత్తాను చాటుకున్నారు ప్రభుదేవా. ప్రస్తుతం నటుడిగా పలు సినిమాలతో బిజిగా ఉన్న ప్రభుదేవా.. తాజాగా ఒక బేబీ గర్ల్‌కు తండ్రి అయ్యారు. ఇప్పటివరకు ప్రభుదేవాకు కొడుకులు తప్ప కూతుళ్లు లేరు. దీంతో తన సంతోషానికి అవధులు లేవని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రభుదేవానే ప్రకటించారు.


ప్రభుదేవాకు ముందుగా రామ్‌లథ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. 2011లో రామ్‌లథ్‌కు విడాకులు ఇచ్చేశారు. అప్పటికే వీరిద్దరికీ ముగ్గురు కొడుకులు పుట్టారు. కానీ ప్రభుదేవాకు, రామ్‌లథ్‌కు పుట్టిన పెద్ద కొడుకు 13 ఏళ్ల వయసులోనే క్యాన్సర్‌తో మరణించాడు. ఆ తర్వాత కొంతకాలం సింగిల్‌గా ఉన్న ప్రభుదేవా.. హిమానీ సింగ్ అనే ఫిజియోథెరపిస్ట్‌తో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని రూమర్స్ మొదలయ్యాయి. ఆ రూమర్స్‌ను నిజం చేస్తూ.. హిమానీ సింగ్‌ను 2020లో సీక్రెట్‌గా పెళ్లి కూడా చేసుకున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభుదేవా.. 50 ఏళ్ల వయసులో తనకు కూతురు పుట్టింది అంటూ స్వయంగా ప్రకటించారు. ఇప్పుడే తను చాలా సంతోషంగా ఉన్నానని, తన జీవితానికి ఒక అర్థం వచ్చినట్టుగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కూతురు కోసం తన పనులన్నీ పక్కన పెట్టేసి, ఎక్కువ సమయాన్ని ఫ్యామిలీతో గడపాలని నిర్ణయించుకున్నట్టు బయటపెట్టారు. ఇప్పటివరకు తను పనిలో పడి ఫ్యామిలీని పక్కన పెట్టానని, ఇప్పుడు అలా కాకుండా ఎక్కువ సమయం తన ఫ్యామిలీతో గడపాలి అనుకుంటున్నానని తెలిపారు ప్రభుదేవా.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×