BigTV English

Ind vs Aus: ఐసీసీ నాకౌట్‌ లలో ఆసీస్‌పై టీమిండియానే తోపు..ఇదిగో లెక్కలు ?

Ind vs Aus: ఐసీసీ నాకౌట్‌ లలో ఆసీస్‌పై టీమిండియానే తోపు..ఇదిగో లెక్కలు ?

Ind vs Aus: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో భాగంగా ఇవాళ తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ సెమీఫైనల్ లో భాగంగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్టు తలపడబోతున్నాయి. దుబాయ్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు… ఈ సెమీఫైనల్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో మూడు వరుస విజయాలను దక్కించుకున్న టీమిండియా… సెమీఫైనల్ లో గెలిచి.. ఫైనల్ లో అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. అటు ఐసీసీ టోర్నమెంటులో దుమ్ము లేపే ఆస్ట్రేలియా… ఈసారి మళ్లీ టోర్నమెంట్ గెలవాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో… ఐసీసీ టోర్నమెంట్లలోని నాకౌట్ స్టేజీలలో ఈ రెండు జట్ల మధ్య రికార్డులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటివరకు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య… ఐసీసీ టోర్నమెంటులో భాగంగా 8 నాకౌట్ మ్యాచ్ లు జరిగాయి. అయితే ఇందులో చెరో నాలుగు మ్యాచ్ లు గెలిచాయి. 1998 నుంచి 2023 వరకు… జరిగిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్ ల లెక్కల ప్రకారం… రెండు జట్లు సమఉజ్జీవులుగా ఉన్నాయి.


Also Read: Ind vs Aus, Semi-Final: ఆసీస్‌ కు చెక్‌..డేంజర్‌ ప్లేయర్లతో టీమిండియా..టైమింగ్స్‌,ఉచితంగా చూడాలంటే ?

ఏ జట్టును తక్కువ అంచనా వేయలేం. 1998 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాకౌట్ మ్యాచ్ లో … ఆస్ట్రేలియాపై 44 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ ఉత్తిరి కొట్టడం జరిగింది. ఈ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ 141 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2020 ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది టీమిండియా. ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ ఏకంగా 84 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2003 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా పై 125 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో రికీ పాంటింగ్ ఏకంగా 140 పరుగులు చేసి రఫ్పాడించాడు. ఆ తర్వాత టి20 వరల్డ్ కప్ 2007 టోర్నమెంటులో సెమీఫైనల్ మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య జరిగింది. ఇందులో 15 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా పై టీం ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ 70 పరుగులు చేసి దుమ్ము లేపాడు.


Also Read:  Yograj Singh: ఇండియా నుంచి ఆమెను తరిమి కొట్టండి..యోగ్ రాజ్ వార్నింగ్?

ఆ తర్వాత… వరల్డ్ కప్ 2011 లో కూడా.. ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఇక వరల్డ్ కప్ 2015 సంవత్సరంలో.. ఈ రెండు జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో 95 పరుగులు తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక 2023 WTC ఫైనల్ మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియా విజయం సాధించడం జరిగింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పై 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇదే మ్యాచ్ లో భయంకరంగా ట్రావిస్‌ హెడ్ బ్యాటింగ్ చేసి.. ఆస్ట్రేలియాను గెలిపించాడు. అంటే ఓవరాల్ గా ఐసిసి నాకౌట్ టోర్నమెంటులో… టీమిండియా నాలుగు మ్యాచ్ లు గెలిస్తే… ఆస్ట్రేలియా మరో నాలుగు మ్యాచ్ లు గెలిచింది. మరి ఇవాల్టి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా గెలిచింది కాబట్టి.. ఇప్పుడు టీమిండియా ప్రతికారం తీర్చుకోవాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×