ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 ఫిబ్రవరి 19వ తేదీ నుండి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ ట్రోఫీకి మరో 37 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. అయితే ఈ టోర్నీకి జట్టును ప్రకటించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జనవరి 12 ని గడువు తేదీగా నిర్ణయించింది. ఈ క్రమంలో మీడియా నివేదికల ప్రకారం ఐసీసీ సూచనలను అనుసరించి టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ జట్టును సకాలంలో ప్రకటిస్తారని అంతా భావించారు.
Also Read: SA20 League: లక్ అంటే ఇదే.. అభిమాని అద్భుత క్యాచ్.. రూ.90 లక్షల రివార్డ్
కానీ బీసీసీఐ దీనికి మరి కొంత సమయం కావాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈనెల 12వ తేదీలోపు జట్టును ప్రకటించాల్సి ఉండగా.. బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే జట్టును ప్రకటించేందుకు గడువు పొడిగించాలని బిసిసిఐ అభ్యర్థించినట్లు తెలుస్తోంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈనెల 18 లేదా 19వ తేదీన జట్టును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
అయితే ఇంగ్లాండ్ తో స్వదేశంలో నిర్వహించబోయే ఐదు మ్యాచ్ ల టి-20 సిరీస్ కి జట్టును ఎంపిక చేసేందుకు రేపు ముంబైలో సెలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో టి20 జట్టును మాత్రమే ఎంపిక చేస్తారని.. వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ జట్ల ఎంపికపై ప్రస్తావన ఉండదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ సిరీస్ కి సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో జట్టులో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఈనెల 22వ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు ఇంగ్లాండ్ తో భారత జట్టు 5 టీ-20 లు ఆడబోతోంది. ఇక చాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఇంగ్లాండ్ జట్టు మినహా మరే జట్టు తమ జట్టును ప్రకటించలేదు. ఇంగ్లాండ్ తో ఐదు టి-20 సిరీస్ అనంతరం.. ఫిబ్రవరి అదో 6వ తేదీ నుండి స్వదేశంలోనే మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడబోయే చివరి వన్డే సిరీస్ ఇదే.
దీంతో ఐసీసీ టోర్నీకి సన్నాహక మ్యాచ్ ని వినియోగించుకోవాలని చూస్తుంది. ఈ వన్డే సిరీస్ కి ఎంపిక అయ్యే జట్టే.. ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగడం ఖాయమని క్రికెట్ వర్గాల విశ్లేషణ. ఇందులో కేవలం ఒకటి లేదా రెండు మార్పులు మాత్రమే ఉండొచ్చని సమాచారం. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లకు ఇదే చివరి ఐసీసీ టోర్నీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also Read: Big Bash league: లైవ్ మ్యాచ్‌లో ఘోరం.. బంతి తగిలి పక్షి గిలగిలా కొట్టుకొని !
మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఘోర ప్రదర్శన పై బీసీసీఐ ఈరోజు సమీక్ష నిర్వహించనుంది. బోర్డు పెద్దలు పాల్గొనే ఈ సమావేశంలో రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్ తమ వివరణ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో టెస్ట్ జట్టు కూర్పుపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.