Big Bash league: సాధారణంగా క్రీడల్లో చిన్నచిన్న ప్రమాదాలు జరగడం మామూలే. ముఖ్యంగా క్రికెట్ లో ఇలాంటి ప్రమాదాలను తరచూ వింటూ ఉంటాం. కొన్నిసార్లు స్టాండ్స్ లో ఉన్న ప్రేక్షకులకు కూడా బంతులు తగిలిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బ్యాటర్లు కొట్టే షాట్లు మైదానంలోని అద్దాలను పగలగొట్టిన ఉదంతాలను కూడా చూశాము. బంతి తగిలి క్రికెటర్లు తీవ్రంగా గాయపడడం మైదానంలో ఎన్నో జరిగాయి. అదే సమయంలో బాల్ తగిలి కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.
Also Read: Champions Trophy: పాక్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఔట్..రూ. 500 కోట్లు నష్టం ?
అయితే ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 2024 – 25 లో అనుకోని ఘటన జరిగింది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా బ్యాటర్ కొట్టిన బంతి వేగంగా మైదానంలో దూసుకెళ్లి అక్కడే తిరుగుతున్న ఓ అరుదైన జాతి పావురాన్ని తాకింది. దీంతో ఆ పావురం మరణించింది. ఈ ఘటనపై క్రికెట్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాష్ లీగ్ – 2025 లో భాగంగా మేల్ బోర్న్ వేదికగా.. మెల్బోర్న్ స్టార్స్ – సిడ్నీ సిక్సర్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన మేల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. గ్లెన్ మాక్స్వెల్ 32 బంతుల్లో 58 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన సిడ్నీ సిక్సర్స్ ఆశించినంత వేగంగా పరుగులు రాబట్టలేకపోయింది. ఈ క్రమంలో పదవ ఓవర్ ని మెల్బోర్న్ బౌలర్ జోయల్ ప్యారిస్ వేశాడు. స్ట్రైకింగ్ లో జేమ్స్ విన్స్ ఉన్నాడు. జోయల్ ప్యారిస్ వేసిన ఈ పదవ ఓవర్ లోని ఐదవ బంతిని విన్స్ బలంగా బౌండరీ దిశగా భాదాడు.
దీంతో బాల్ వేగంగా బౌండరీ దిశగా దూసుకెళ్లింది. అయితే అదే సమయంలో అక్కడ సీగిల్ జాతికి చెందిన అరుదైన పావురాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పదుల సంఖ్యలో పావురాలు అక్కడే తిరుగుతూ కనిపించాయి. అయితే బంతి రావడాన్ని చూసి అన్ని గాలిలోకి ఎగరగా.. ఒక పావురానికి మాత్రం బంతి బలంగా తాకింది. దీంతో ఆ సీగల్ అక్కడికక్కడే రెక్కలు ఊడిపోయి కుప్పకూలింది. కాసేపు కిందపడి విలవిలలాడింది. వెంటనే అక్కడికి చేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది దానిని బయటకి తీసుకువెళ్లారు.
Also Read: Tamim Iqbal: అంతర్జాతీయ క్రికెట్‌కు రెండోసారి తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ ?
కానీ అంతలోనే అది చనిపోయినట్లు తెలిసింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో బ్యాటర్ విన్స్ సహా కామెంట్ కామెంటేటర్స్, ప్రేక్షకులు షాక్ కి గురయ్యారు. ఆస్ట్రేలియాలోని ఈ అరుదైన జాతి పావురాలు డిసెంబర్, జనవరి నెలలలో ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళుతుంటాయట. ఈ క్రమంలోనే పదుల సంఖ్యలో మెల్బోర్న్ స్టేడియంలోకి వచ్చాయని సమాచారం. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని చెబుతున్నారు.
Seagull down 💀 and couldn’t save the boundary. #BBL pic.twitter.com/cfEoSmfKPV
— GrandmasterGamma (@mandaout12) January 9, 2025