Mohammed Shami: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ ఘనవిజయంతో ప్రారంభించింది. గురువారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత జట్టు బంగ్లాదేశ్ ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 228 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు 46.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్ మహమ్మద్ షమి {Mohammed Shami} 200 వికెట్లు పడగొట్టి వన్డే అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన అరుదైన రికార్డు నెలకొల్పాడు.
తన 103 వ ఇన్నింగ్స్ లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి మహమ్మద్ షమీ {Mohammed Shami} ఈ మైలురాయిని చేరుకున్నాడు. 133 ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయిని చేరుకున్న అజిత్ అగర్కర్ రికార్డును అధిగమించాడు. 34 ఏళ్ల తన కెరీర్ లో 200 వికెట్లు తీసిన రెండవ అత్యంత వేగవంతమైన బౌలర్ గా నిలిచాడు మహమ్మద్ షమి. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ 102 ఇన్నింగ్స్ లలో సాధించిన రికార్డు తర్వాత షమీ ఈ అరుదైన రికార్డుని తన పేరిట లిఖించుకున్నాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో మిచెల్ స్టార్క్ {ఆస్ట్రేలియా} 102 ఇన్నింగ్స్ లలో మొదటి స్థానంలో ఉండగా.. మహమ్మద్ షమీ 103 ఇన్నింగ్స్ లలో రెండవ స్థానంలో నిలిచాడు. వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ వరకు అద్భుతమైన ఆటతీరు కనబరిచి.. ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ మెగా టోర్నీలో మహమ్మద్ షమీ ఏడు మ్యాచ్ లలో మూడు సార్లు ఐదు వికెట్ల సాయంతో 24 వికెట్లు పడగొట్టాడు.
ఇక గాయం కారణంగా పూర్తిగా కోలుకునేందుకు వరల్డ్ కప్ అనంతరం విరామం తీసుకున్న షమీ.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్ లో పెద్దగా రాణించలేకపోయినా.. మెగా టోర్నీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తొలి మ్యాచ్ లోనే ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇలా మెగా టోర్నీలలోనే రాణిస్తూ దాని ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు మహమ్మద్ షమి.
అంతేకాకుండా ఈ మ్యాచ్ లో {Mohammed Shami} ఐదు వికెట్లు పడగొట్టి ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో క్రికెటర్ గా రికార్డు సృష్టించడమే కాకుండా.. ఐసీసీ ఈవెంట్స్ లో అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్ గా నిలిచాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైఫర్ సాధించిన తొలి భారత బౌలర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాకుండా ఐసీసీ వైట్ బాల్ ఈవెంట్స్ లో మెన్ ఇన్ బ్లూ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.