Gundeninda GudiGantalu Today episode February 21th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా బట్టలు ఉతికినందుకు శృతి డబ్బులు ఇస్తుంది. దాంతో మీనా చాలా బాధపడుతుంది. ఆ డబ్బును రవికి తిరిగికి ఇవ్వమని భర్త బాలుతో మీనా చెబుతుంది. ఎలాంటి గొడవ పడొద్దని కూడా కోరుతుంది. శృతి డబ్బులు ఇవ్వడం పట్ల మీనా తన భర్తతో చెప్పుకుంటూ ఎంతో బాధపడుతుంది. తనకు జరిగిన అవమానం పట్ల భర్త రవి ఎవరితోనూ గొడవపడకూడదని కోరుతుంది. మీనా బాధను ఎలాగైనా పోగొట్టాలి అందరూ ముందు మీనా గర్వంగా తిరగాలి అన్నట్టు బాలు ఒక ప్లాన్ చేస్తాడు. వేకువ జామునే బాలు తన అత్తగారి ఇంటికి వెళ్లి తలుపు కొడతాడు. ఏమైంది బాబు ఈ టైంలో వచ్చారు అని పార్వతి అడుగుతుంది. ఏం లేదు మీరు అర్జెంటుగా మంచి బట్టలు వేసుకొని రెడీ అవ్వండి మీకు ఒక చోటికి తీసుకెళ్తాను. ఒక విషయం చెప్పాలి అనేసి బాలు అంటాడు. శివకి ఒక పని అప్పగిస్తాడు. ఇక బాలు సుమతి పార్వతి ముగ్గురు కలిసి కార్లు బయలుదేరుతుంటారు కానీ సుమతి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది.. కానీ బాలు నిజం చెప్పకుండా దాస్తాడు.. మీనాను పొద్దున్నే లేచి రెడీ అవ్వమని చెబుతాడు. ఇంట్లో వాళ్లందరిని త్వరగా లేచి రెడీ అవ్వాలని అడుగుతాడు. అందరు బయటకు వచ్చింది బండిని చూసి షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బయటికి వచ్చి ఎదురుచూస్తుంటారు. అసలేంటీరా అని బాలును అడుగుతూనే ఉంటారు. సర్ ప్రైజ్.. సర్ ప్రైజ్ అని తన ఫ్రెండ్ రాజేశ్ రాగానే అప్పటికే ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసిన పూలకొట్టును కుటుంబ సభ్యులందరికీ చూపించి సర్ ప్రైజ్ చేస్తాడు. పైగా తన తల్లి పేరు మీదుగా ప్రభావతి పూల కొట్టు, ప్రొప్రైటర్ మీనా అని బోర్డు కూడా ఏర్పాటు చేస్తాడు. అది చూసి కుటుంబీకులంతా షాక్ అవుతారు. మీనా చేత ఈ పూల కొట్టు పెట్టించాలని నేను అనుకున్నాను. ఏమంటున్నానో అంటే చాలా సంతోషంగా ఉందిరా ఇన్నాళ్లకు మంచి పని చేశావని సత్యం అంటాడు.. ప్రభావతి మాత్రం షాక్ లో ఉండిపోతుంది. పూలకొట్టు ప్రారంభోత్సవం చాలా ఆసక్తికరంగా మారింది. కొట్టు ఓపెనింగ్ సమయంలో బాలు అందరిపై విరుచుకుపడ్డారు. తన భార్య మీనా పడ్డ వేదనను అర్థమయ్యేలా వివరించాడు బాలు. ఈ ఆలోచన చాలా బాగుందిరా భార్య గురించి నువ్వు ఎంతగా ఆలోచించావో అర్థం అవుతుందని సత్యం అంటాడు.
డబ్బుడమ్మా శృతి, రోహిణి లాగే మీనా కూడా సంపాదించుకుంటుంది అని బాలు అంటాడు. ఇన్ని రోజులు మీనా ను పనికి మాత్రమే పనికొస్తుందని ఇంట్లో పనిమనిషి లాగా చూశారు. ఇప్పుడు తనకు వచ్చిన టాలెంటు పూలని చక్కగా అల్లడం ఆ టాలెంట్ ని ఇప్పుడు అందరికీ చూపిస్తుంది తానేంటో నిరూపించుకుంటుందని బాలు అంటాడు.. పూలకొట్టుకు తల్లి ప్రభావతి పేరును పెట్టినా.. చిన్న కోడలు శృతితో ఓపెనింగ్ చేయించారు. ఆ తర్వాత బాలు, మీనా తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. తండ్రి బాలు చేసిన పనికి ఎంతో సంతోషిస్తాడు.. ఈ పూల కోట్టు ని అమ్మ రిబ్బన్ కట్ చేయాలనీ మనోజ్ అంటే లేదు. మరి నాన్నతో చేయిస్తావా అంటే లేదు సెలబ్రిటీలకు గొంతు చెపుతుంది కదా అదే డబ్బింగ్ చెప్తుంది కదా శృతిని రిబ్బన్ కట్ చేస్తుంది ఆమె ఇప్పుడు మనకు సెలబ్రిటీ అనేసి బాలు అంటాడు. శృతి చేత రిబ్బన్ కట్ చేస్తారు.. ఆ తర్వాత ఎవరైనా చేసిన పనికి మెచ్చుకొని డబ్బులు ఇవ్వాలని నాకు డబ్బుడమే చెప్పింది అందుకే ఇందులో 2500 ఉన్నాయని శృతికి ఒక కవర్ ఇస్తారు. అది తీసుకొని శృతిని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది..
సత్యం – ప్రభావతి మధ్య సాగిన సరదా సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. భార్య ప్రభావతిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తారు. కొడుకు బాలుపై రగిలిపోతున్న ఆమెను సత్యం కూల్ చేస్తాడు.. రోహిణి పార్లర్ కు తన పేరు పెట్టుకొని గౌరవం పెంచారని, కానీ బాలు మరీ పూలకొట్టుకు నా పేరు పెట్టారని తల్లి ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏమాత్రం కూడా తనకు బాలు చేసిన పని నచ్చలేదని భర్త సత్యంతో చెప్పుకుంటుంది. భర్త సర్దిచెప్పే క్రమంలోనే.. కామాక్షి నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికే మండిపోతున్న ప్రభావతికి కామాక్షి మాటలు ఇంకా మంటను పెంచాయి. అలా వారిరువరి మధ్య బాలు, పూలకొట్టుపై సంభాషణ జరుగుతూనే ఉంటుంది. ‘మీనాను నువ్వు పూలు కుట్టుకునేది.. పూలు కుట్టుకునేది అంటూ ఉండేదానికి కాదా.. ఇప్పుడు అది తిరిగి నీమీదకే వచ్చింది. ఇప్పటి నుంచి అందరూ ప్రభావతి పూల కొట్టు అని పిలుస్తారు అని ప్రభావతిని కామాక్షి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..