BigTV English

ICC CT 2025 Semi-finals: ఆ జట్టుతోనే టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్.. ఇదిగో లెక్కలు ?

ICC CT 2025 Semi-finals: ఆ జట్టుతోనే టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్.. ఇదిగో లెక్కలు ?

ICC CT 2025 Semi-finals: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో సెమీ ఫైనల్స్ సినారియో ఇంటరెస్టింగ్ గా మారింది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు జట్లు సెమీస్ చేరుకున్నాయి. గ్రూప్ – ఏ నుండి భారత్ – న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్ కి చేరుకున్నాయి. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు టోర్నీ నుండి నిష్క్రమించాయి. ఇక గ్రూప్ – బి నుండి మాత్రం ఇంకా ఒక్క జట్టు కూడా సెమీఫైనల్ కి చేరలేదు. కానీ గ్రూప్ – బి నుండి ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యింది. ఇక రెండు సెమిస్ బెర్త్ ల కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి.


 

వీటిలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా రేసులో ముందు ఉంటే.. ఆఫ్ఘనిస్తాన్ కూడా వాటికి పోటీ ఇస్తుంది. బుధవారం రోజు లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టును ఓడించి ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపుతో రెండు పాయింట్లును సాధించి సెమీస్ రేసులోకి వచ్చింది అఫ్గానిస్తాన్. ఇక గ్రూప్ – బి లో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మూడేసి పాయింట్లతో తొలి రెండు స్థానాలలో ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇంకా ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే గ్రూప్ – బి లో ఏ ఏ జట్టు సెమీస్ కి చేరతాయి..? సెమీ ఫైనల్ లో భారత జట్టుతో ఏ టీం తలపడుతుంది..? అనేది ఇప్పుడు క్రీడాభిమానులలో ఆసక్తికరంగా మారింది.


గ్రూప్ బి లో ఆఫ్ఘనిస్తాన్ – ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ – సౌత్ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోతే.. ఆఫ్ఘనిస్తాన్ తో పాటు సౌత్ ఆఫ్రికా నాకౌట్ కి చేరుతుంది. అటు ఇంగ్లాండ్ పై సఫారీలు ఓడిపోతే ఆస్ట్రేలియాకి కొంత అవకాశం ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మూడేసి పాయింట్లు ఉంటాయి కానీ.. నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న కారణంగా సౌత్ ఆఫ్రికా సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా + 2.140, ఆస్ట్రేలియా + 0.475 నెట్ రన్ రేట్ తో ఉన్నాయి. ఇక మార్చి రెండవ తేదీన న్యూజిలాండ్ – ఇండియా మధ్య జరగనున్న మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్ – ఎ లో అగ్రస్థానంలో నిలుస్తుంది.

 

ఈ జట్టు గ్రూప్ – బి లోని రెండవ స్థానంలో నిలిచిన జట్టుతో మార్చి 4న జరిగే సెమీఫైనల్ 1 లో తలపడుతుంది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మిగిలిన ఒక్కో మ్యాచ్లో గెలిచి న్యూజిలాండ్, భారత్ ని ఓడిస్తే తొలి సెమీస్ లో భారత్ – ఆస్ట్రేలియా తలపడతాయి. ఒకవేళ న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోతే.. సౌత్ ఆఫ్రికా – భారత్ మధ్య సెమి ఫైనల్ 1 జరుగుతుంది. అలాగే ఆస్ట్రేలియా ను ఆఫ్గనిస్తాన్ ఓడించి.. ఇంగ్లాండ్ పై దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే, గ్రూప్ – ఎ లో భారత్ అగ్రస్థానంలో ఉంటే.. ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. ఒకవేళ భారత్.. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే సౌత్ ఆఫ్రికాతో పోటీ పడుతుంది. ఇక సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా తమ మ్యాచ్లలో ఓడిపోతే.. భారత్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి సెమీఫైనల్ ఉంటుంది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×