
Indian Cricket Team : వన్డే వరల్డ్ కప్ లో భాగంగా వరుసగా ఐదు మ్యాచ్ ల్లో విజయం సాధించిన ఇండియా మంచి జోరు మీద ఉంది. ఈ సమయంలో ధర్మశాలలో ఉన్న మనవాళ్లు చక్కగా ఎంజాయ్ చేశారు. ట్రెక్కింగ్ కి మాత్రం కోచ్ రాహుల్ ద్రవిడ్ టీమ్ కి మాత్రమే అవకాశం ఇచ్చారు. ప్లేయర్లు ఎవరినీ కొండలెక్కి దిగవద్దని హెచ్చరించారు. ఎందుకంటే అలసిపోతే మళ్లీ గ్రౌండ్ లో ఆడలేరని బీసీసీఐ ఆంక్షలు విధించేసరికి మనవాళ్లు హిమాలయాల నుంచి వచ్చే నదుల్లోనే ఆటలు ఆడుతూ కాలక్షేపం చేశారు.
ఇదిలా ఉండగా ఆదివారం ఇంగ్లండ్ తో మ్యాచ్ ఉంది. ఇప్పుడు జట్టు కూర్పు మేనేజ్ మెంట్ కి పెద్ద తలనొప్పిగా మారింది. హార్థిక్ పాండ్యా ఇప్పటికప్పుడు ఆడే పరిస్థితి లేదు. ఏకంగా సెమీస్ లోకే వచ్చేలా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో న్యూజిలాండ్ మ్యాచ్ లో మూడో పేసర్ గా షమీని తీసుకున్నారు. తను అదరగొట్టే ప్రదర్శన చేశాడు. దీంతో అతన్ని తొలగించలేని పరిస్థితి ఉంది.
ఇకపోతే లక్నో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో శార్ధూల్ ని పక్కన పెట్టి అశ్విన్ కి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు బూమ్రా, సిరాజ్, ముగ్గురు స్పిన్నర్లు జడేజా, అశ్విన్, కులదీప్ ఉంటారు. ఆలౌరౌండర్ గా హార్దిక్ పాండ్యా ఉంటే సరిపోయేది. ఆరో బౌలర్ గా ఉపయోగపడేవాడు. పార్ట్ టైమ్ బౌలర్లు కూడా లేరు. అందురూ బ్యాటర్లే ఉన్నారు. అందుకే ఇప్పుడతని ప్లేస్ లో షమీని తీసుకోవాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు.
స్పిన్ పిచ్ మీద ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఎంతవరకు ఆడవచ్చనేది సందేహంగా ఉంది. అలా కాకుండా సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యాడు కాబట్టి, అతని ప్లేస్ లో బౌలర్లను పెంచితే, బ్యాటింగ్ బలహీనంగా మారేలా ఉంది. మన టైమ్ బాగాలేకపోతే.. రోహిత్, గిల్, కొహ్లీ, రాహుల్ , శ్రేయాస్ వీళ్ల తర్వాత జడేజా వస్తాడు. తర్వాత నుంచి అంతా బౌలర్లే…తేలిపోతే ప్రమాదమని అంటున్నారు. అంతేకాకుండా ఇంగ్లండ్ జట్టుని తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్లది డిసైడింగ్ గేమ్ కాబట్టి, వచ్చిన బాల్ ని వచ్చినట్టు దంచి కొట్టడం మొదలుపెడితే…ఇంకో బౌలర్ లేకపోతే…స్కోర్ ఎంతదూరమైనా వెళుతుందని అంటున్నారు.
ఇప్పుడు జట్టు కూర్పు మేనేజ్ మెంట్ మెడమీద కత్తిలా ఉంది. గ్రౌండ్ లో దిగేవరకు ఎవరు ఆడతారు? ఎవరు బెంచ్ పై ఉంటారనేది సందిగ్ధంగానే ఉందని అంటున్నారు.