
Quinton De Kock : సఫారీ ఆటగాడు, విధ్వంసకర ఓపెనర్, వికెట్ కీపర్ అయిన 30 ఏళ్ల క్వింటన్ డికాక్ వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అయితే టీ 20 లు ఆడతానని తెలిపాడు. ఇంతకు ముందే టెస్ట్ మ్యాచ్ లకు గుడ్ బై చెప్పిన డికాక్ ఇప్పుడు వన్డేలకు వీడ్కోలు తెలిపాడు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ లో ఓటమి అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతకుముందే రాజీనామా విషయాన్ని సెలక్టర్లకు చెప్పాడు. వాళ్లు కూడా అంగీకరించినట్టు సమాచారం.
ఈ మెగా టోర్నీలో అద్భుతంగా రాణించిన డికాక్ 4 సెంచరీలతో 594 రన్స్ చేశాడు.
డికాక్ 2013లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన డికాక్ , ఓపెనర్‌గా సఫారీ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అంతేకాదు ఈ లెఫ్ట్ హ్యాండర్ 21 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యు పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు చేసిన నాలుగో క్రికెటర్ అయ్యాడు. మొత్తం 155 వన్డేలు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 6770 పరుగులు చేశాడు. అందులో 21 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు దక్షిణాఫ్రికా బెస్ట్ వికెట్ కీపర్లలో ఒకడైన డికాక్ 208 క్యాచ్‌లు, 17 స్టంపింగ్స్‌తో అందరినీ పెవెలియన్ కి పంపించాడు.
54 టెస్ట్ ల్లో 3300 పరుగులు చేశాడు. 80 టీ 20 మ్యాచ్ ల్లో 2277 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన డికాక్ కెప్టెన్ గా కూడా తన సేవలందించాడు. ఎన్నో విజయాలు అందించాడు. సౌతాఫ్రికా క్రికెట్ కి డికాక్ ఎంతో గొప్ప సేవ చేశాడని అతని సహచరులు, కెప్టెన్ బవుమా తెలిపారు. సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో డికాక్ ది ఒక ప్రత్యేక స్థానమని కొనియాడారు.
రిటైర్మెంట్ ప్రకటించిన డికాక్ మాట్లాడుతూ నా శరీరం ఏమో 40 ఏళ్లు అంటోంది. కానీ నా ఐడీ చూస్తే 30 ఏళ్లు చూపిస్తోందని అన్నాడు. కానీ నేనేమో 20 ఏళ్ల వాడిలా నటిస్తున్నానని భావోద్వేగానికి గురయ్యాడు. ఈ క్రికెట్ అనే స్టేజి మీద కుర్రాడిలా ఎక్కువ కాలం నటించలేక, స్టేజి దిగిపోతున్నానని తెలిపాడు. శరీరం సహకరించని కారణంగానే వన్డేలకు దూరమైనట్టు తెలుస్తోంది.