BigTV English

Emerging Asia Cup 2024: నేడు సెమీస్‌ పోరు…ఆఫ్ఘానిస్తాన్ తో టీమిండియా ఫైట్‌

Emerging Asia Cup 2024: నేడు సెమీస్‌ పోరు…ఆఫ్ఘానిస్తాన్ తో టీమిండియా ఫైట్‌

Emerging Asia Cup 2024: టీమిండియా ( Team india ) వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ( Afghanisthan ) మధ్య ఇవాళ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 ( Emerging Asia Cup 2024 ) టోర్నమెంట్ లో భాగంగా… సెమీ ఫైనల్ కు చేరుకున్న టీమిండియా ( Team india ) ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ( Afghanisthan ) జట్టుతో… తలపడబోతుందన్నమాట. టీమిండియా ఏ జట్టు సెమీఫైనల్ వరకు చేరింది. ఈ జట్టుకు తిలక్ వర్మ ( Tilak varma) కెప్టెన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరు ఊహించని విధంగా సెమీ ఫైనల్ వరకు వెళ్ళింది టీం ఇండియా.


Also Read: Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 టోర్నమెంట్లో రెండు సెమి ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో మొదటిది పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరగనుంది. రెండవ సెమీఫైనల్ మ్యాచ్ టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగబోతుంది. గ్రూప్ బి లో టీమిండియా టాప్ పొజిషన్లో నిలిచింది. అటు గ్రూప్ ఏ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ( Afghanisthan ) రెండవ స్థానంలో నిలిచింది. ఈ తరుణంలోనే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైట్ జరుగుతోంది.


ఈ సెమి ఫైనల్ మ్యాచ్ గెలిచిన జట్టు… నేరుగా ఫైనల్ వెళ్తుంది. అయితే శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్( Pakisthan) జట్లలో… పాకిస్తాన్ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇటు టీమిండియా ( Team india ) కూడా ఫైనల్ కు చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే జరిగితే ఫైనల్ లో టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య పెద్ద ఫైట్ ఉంటుంది. ఈ రెండు జట్లు ఫైనల్ లో తలపడితే… ఇక ఆ రోజంతా పండగ వాతావరణమే ఉంటుంది.

ఇవాల్టి సెమీఫైనల్ మ్యాచ్… ఒమన్ లో జరగనుంది. అయితే గ్రూప్ స్టేజ్లో టీమిండి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా నేరుగా సెమీఫైనల్ వరకు వెళ్ళింది. ఇప్పటి వరకు గ్రూప్ స్టేజిలో… ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 ( Emerging Asia Cup 2024 ) టోర్నమెంట్ కు అతిథ్యం ఇచ్చిన… ఒమన్ ను మొదటగా ఓడించింది టీమిండియా. ఆ తర్వాత యూఏఈ మరియు పాకిస్తాన్ జట్టను కూడా మట్టి కరిపించి టాప్ పొజిషన్లోకి వచ్చింది.

 

  • ఆఫ్ఘానిస్తాన్ VS టీమిండియా జట్ల వివరాలు

ఇండియా A జట్టు: అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), రమణదీప్ సింగ్, తిలక్ వర్మ(c), అనుజ్ రావత్, హృతిక్ షోకీన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రాహుల్ చాహర్, ఆయుష్ బడోని, నేహాల్ వధేరా, రసిఖ్ దార్ సలామ్, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ ఖాంబోజ్ , వైభవ్ అరోరా, నిశాంత్ సింధు.

ఆఫ్ఘనిస్తాన్ A స్క్వాడ్: జుబైద్ అక్బరీ, సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ(c), కరీం జనత్, షాహిదుల్లా కమల్, మహ్మద్ ఇషాక్(w), షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, అల్లా ఘజన్‌ఫర్, ఫరీదూన్ దావూద్జాయ్, బిలాల్ సమీ, తఫీల్ ఖాలియా, నంగేయా, నంగేయా షా, అబ్దుల్ రెహమాన్

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×