E-Paper
Advertisement

Saif Ali Khan : ప్ర‌భాస్ త‌ర్వాత‌ ఎన్టీఆర్‌కి విల‌న్‌గా మారుతున్న బాలీవుడ్ స్టార్‌

Saif Ali Khan : ప్ర‌భాస్ త‌ర్వాత‌ ఎన్టీఆర్‌కి విల‌న్‌గా మారుతున్న బాలీవుడ్ స్టార్‌
Advertisement
Saif Ali Khan

Saif Ali Khan : తెలుగు సినిమా రేంజ్ ఎప్పుడో మారిపోయింది. తెలుగు అనే కాదు.. సౌత్ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌నే దాటేసింది. అంతెందుకు ఆస్కార్ సాధించిన ఘ‌న‌త కూడా తెలుగు సినిమా సొంతం చేసుకోవటం విశేషం. అలాంటి తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఎన్నో రూపొందుతున్నాయి. బిగ్ బ‌డ్జెట్ స్టార్స్‌, మీడియం బ‌డ్జెట్ స్టార్స్ అంద‌రూ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. త‌మ మార్కెట్‌ను పెంచుకునే ప‌నిలో ఉన్నారు.

మ‌రోవైపు ఒక‌ప్పుడు బాలీవుడ్ స్టార్స్ పెద్ద‌గా సౌత్ సినిమాల్లో న‌టించ‌టానికి ఆస‌క్తి చూపేవారు కాదు.. కానీ ఇప్పుడు సౌత్ స్టార్స్ చేస్తున్న పాన్ ఇండియా మూవీస్‌లో బాలీవుడ్ స్టార్స్ న‌టించ‌టానికి రెడీ అయిపోతున్నారు. ఇప్ప‌టికే సంజ‌య్ ద‌త్‌, జాకీష్రాఫ్ వంటి వారు ఇక్క‌డ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టించేశారు. ఇప్పుడు మ‌రో బాలీవుడ్ స్టార్ ఆల్ రెడీ ఎంట్రీ ఇచ్చేశారు. ఆయ‌నెవ‌రో కాదు.. సైఫ్ ఆలీఖాన్‌. ఇప్ప‌టికే ఆదిపురుష్ చిత్రంలో లంకాధిప‌తి రావ‌ణాసురుడిగా ఆయ‌న న‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు NTR 30లోనూ సైఫ్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నారు.

Advertisement

NTR 30ని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే ఎన్టీఆర్ స‌ర‌స‌న జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.ఇప్పుడు ఈ లిస్టులో సైఫ్ కూడా జాయిన్ అయిన‌ట్లే. కొర‌టాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వ‌చ్చే వారంలోనే ఈ సినిమా షూటింగ్ షురూ అవుతుంద‌ని టాక్ వినిపిస్తోంది.రత్నవేలు, సాబు సిరిల్, అనిరుద్ రవిచంద్రన్ వంటి స్టార్ టెక్నీషియన్స్ కూడా టీమ్‌లో జాయిన్ అయ్యారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో హరికృష్ణ, మిక్కినేని సుధాకర్ కలిసి NTR 30ని నిర్మించబోతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×