BigTV English

Rohit Sharma: క్యాచ్ మిస్.. దండం పెడుతూ క్షమాపణలు చెప్పిన రోహిత్!

Rohit Sharma: క్యాచ్ మిస్.. దండం పెడుతూ క్షమాపణలు చెప్పిన రోహిత్!

Rohit Sharma: ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ నేడు తన తొలి మ్యాచ్ ని బంగ్లాదేశ్ తో ఆడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ ఆరంభ మ్యాచ్ లోనే బంగ్లాదేశ్ కి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ వెంట వెంటనే మూడు వికెట్లను కోల్పోయింది.


 

బంగ్లాదేశ్ ఓపెనర్ తంజీద్ 25 పరుగులు చేసి క్రీజ్ లో నిలదుక్కుకున్నాడు. ఆ సందర్భంలో 9వ ఓవర్ వేసిన భారత స్పిన్నర్ అక్షర్ పటేల్.. రెండవ బంతికి తంజిద్ ని పెవిలియన్ చేర్చాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ ముష్బికర్ ని 0 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. ఈ రెండు క్యాచ్ లను వికెట్ కీపర్ కే ఎల్ రాహుల్ అద్భుతంగా అందుకున్నాడు. ఇద్దరు బ్యాటర్లు అవుట్ అయ్యాక.. అక్షర్ పటేల్ కి హైట్రిక్ సాధించే అవకాశం వచ్చింది.


ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరు ఫీల్డర్లను స్లిప్ లో పెట్టాడు. ఇక అనంతరం బ్యాటింగ్ కి దిగిన జకేర్ అలీ కూడా స్లిప్ లో దొరికిపోయేవాడే. అక్కడే కాచుకు కూర్చున్న రోహిత్ శర్మ బంతిని అందుకున్నట్లే కనిపించాడు. కానీ చివరి క్షణంలో బంతిని చేజార్చాడు. దీంతో అక్షర్ పటేల్ హైట్రిక్ మిస్ అయిపోయింది. ఆ క్యాచ్ వదిలేసిన రోహిత్ శర్మ నిరాశ వ్యక్తం చేస్తూ చేతులను నేలకేసి కొడుతూ కనిపించాడు. ఆ తరువాత దీనికి సంజాయిషీగా అక్షర్ పటేల్ కి క్షమాపణలు చెబుతూ రోహిత్ శర్మ సైగలు చేశాడు. ఇలా రోహిత్ శర్మ క్షమాపణలు చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒకవేళ రోహిత్ శర్మ ఈ క్యాచ్ పట్టి ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో హైట్రిక్ సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా అక్షర్ పటేల్ నిలిచేవాడు. కానీ రోహిత్ శర్మ ఆ అవకాశాన్ని మిస్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు కొందరు ఫీల్డింగ్ అదరగొడుతుంటే.. మరికొందరు క్యాచ్ లు పట్టకపోవడంపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవీంద్ర జడేజా బౌలింగ్ లో కేఎల్ రాహుల్ ఓ స్టంపింగ్ మిస్ చేయగా, శ్రేయస్ అయ్యర్ ఓ రన్ అవుట్ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. అలాగే కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా ఓ క్యాచ్ మిస్ చేశాడు.

 

దీంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు బతికిపోయారు. టీం ఇండియా చెత్త ఫీల్డింగ్ కారణంగా బంగ్లాదేశ్ 35/5 దశ నుండి ఇప్పుడు 191/6 తో కోలుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు 43.4 ఓవర్ల వద్ద ఆరు వికెట్లను కోల్పోయి 192 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్ హ్రిదోయ్ 102 బంతులలో 86 పరుగులతో రాణిస్తూ.. బంగ్లాదేశ్ జట్టు పరువుని కాపాడుతున్నాడు. మరో బ్యాటర్ జకీర్ అలీ 114 బంతులలో 68 చేసి షమీ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 3, హర్షిత్ రానా 1, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంలోనే రోహిత్ శర్మ తన పేరు మీద ఓరికార్డును నమోదు చేసుకున్నాడు. భారత్ తరపున అత్యధిక ఐసీసీ టోర్నమెంట్లు ఆడిన ప్లేయర్ల జాబితాలో మహేంద్రసింగ్ ధోనీని వెనక్కు నెట్టి 15వ స్థానంలో నిలిచాడు.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×