Marcus Stoinis Retirement: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు ఆస్ట్రేలియాకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినీస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫిబ్రవరి 6 గురువారం రోజున వన్డే క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి 15 మందితో కూడిన జాబితాలో చోటు దక్కించుకున్న ఈ ఆల్రౌండర్ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు.
Also Read: Ind vs Eng 1st ODI: నేటి నుంచే వన్డే సిరీస్..టైమింగ్స్ ఇవే..ఉచితంగా ఇలా చూడండి ?
35 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ తన వన్డే కెరీర్ లో 71 వన్డేలు ఆడి 1,495 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ తో పాటు ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్ లో కూడా మొత్తంగా 48 వికెట్లు పడగొట్టాడు. అయితే మార్కస్ స్టోయినీస్ టి-20 క్రికెట్ పై దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా తరపున స్టోయినిస్ చివరి వన్డే ని పాకిస్తాన్ తో జరిగిన సిరీస్ లో ఆడాడు. తన చివరి మ్యాచ్ లో 8 పరుగులు చేశాడు.
పాకిస్తాన్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ వన్డేలో తన బౌలింగ్ లో 11 పరుగులు ఇచ్చాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. ఆస్ట్రేలియా కోసం ఆడడం అద్భుతమైన ప్రయాణం అని పేర్కొన్నాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టును ఉత్సాహపరుస్తానని పేర్కొన్నాడు.
లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి దిగే స్టోయినీస్ మెరుపు ఇన్నింగ్స్ లకు పెట్టింది పేరు. ఎన్నోసార్లు తన ఫినిషింగ్ ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా జట్టుకు చాలా సార్లు విజయాలను అందించాడు. ఇలా అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి ఆస్ట్రేలియా అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను నిరాశకు గురిచేశాడు. అతడి స్థానంలో మరో ఆటగాడిని కూడా ఊహించుకోలేం. ఇది ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
ఇలా మొత్తంగా చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియా ఓపెనర్, స్టార్ ఆల్ రౌండర్ మిచల్ మార్ష్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు. వెన్నుముక గాయంతో ఇబ్బంది పడుతున్న మిచల్ మార్ష్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావడంతో అతడి స్థానంలో వెబ్ స్టర్ ఎంపిక అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఫాస్ట్ బౌలర్లు జోష్ హేజిల్ వుడ్, పాట్ కమీన్స్ గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.
వీరు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి కోలుకుంటారనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పుడు మార్కస్ స్టోయినిస్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇక ఛాంపియన్ ట్రోఫీ లో ఆస్ట్రేలియా గెలుపుపై ఆశలు సన్నగిల్లాయి. ఇక మార్కస్ స్టోయినీస్ తన రిటైర్మెంట్ సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ పై పోస్ట్ చేశాడు. ఆస్ట్రేలియా తరపున వన్డే క్రికెట్ ఆడటం ఓ అద్భుతమైన ప్రయాణంగా అభివర్ణించాడు. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన క్రికెట్ ఆస్ట్రేలియాకి తెలిపాడు.