BigTV English

Sunrisers Hyderabad: కావ్యాపాప భారీ డీలింగ్‌.. ఈ సారి ఏకంగా రూ.1092 కోట్లు !

Sunrisers Hyderabad: కావ్యాపాప భారీ డీలింగ్‌.. ఈ సారి ఏకంగా రూ.1092 కోట్లు !

Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} ఫ్రాంచైజీలు ప్రస్తుతం ఎక్కువగా 100 లీగ్ లపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ముంబై, లక్నో సూపర్ జెయింట్స్ ఈ హండ్రెడ్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా మరో ఐపీఎల్ టీమ్ కూడా ఇందులోకి అడుగు పెట్టింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు {ఈసీబీ} కి చెందిన 100 లీగ్ లో నార్తర్న్ సూపర్ చార్జర్స్ లో సన్రైజర్స్ హైదరాబాద్ {Sunrisers Hyderabad} భాగస్వామ్యం అయ్యింది.


Also Read: Ind vs Eng 1st ODI: నేటి నుంచే వన్డే సిరీస్‌..టైమింగ్స్‌ ఇవే..ఉచితంగా ఇలా చూడండి ?

యార్క్ షైర్ కౌంటీ కేంద్రంగా ఉన్న నర్తర్న్ సూపర్ చార్జర్స్ టీమ్ లో చెన్నైకి చెందిన సన్ గ్రూప్ 49% వాటాను కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు 100 మిలియన్ బ్రిటన్ పౌండ్లు {సుమారు రూ.1092 కోట్లు} గా తెలుస్తోంది. బుధవారం రోజు కొనసాగిన అమ్మకంలో సన్ గ్రూప్ అత్యధిక మొత్తానికి బిడ్ చేసింది. సన్ గ్రూప్ {Sunrisers Hyderabad} కి ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ తో పాటు సౌత్ ఆఫ్రికా టీ-20 లీగ్ లో ఈస్టర్న్ కేప్ టీమ్ కూడా ఉంది.


ఇప్పుడు ఆ గ్రూప్ తమ జాబితాలో మూడు టీమ్ ని కూడా చేర్చింది. అంతేకాదు 100 లో టీమ్ వాటాను కొనుగోలు చేసిన మూడవ ఐపీఎల్ టీమ్ యాజమాన్యంగా సన్ గ్రూప్ నిలిచింది. ఇక ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ {Sunrisers Hyderabad} కి సంబంధించిన వ్యవహారాలను కావ్య మారన్ {kavya maran} చూసుకుంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో వాటాను కొనుగోలు చేయగా.. అంతకుముందు ముంబై ఇండియన్స్ {mumbai indians} కి చెందిన రిలయన్స్ యాజమాన్యం ఓవల్ ఇన్వెన్షిబుల్ జట్టులో వాటాను దక్కించుకుంది.

ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ {Sunrisers Hyderabad} యాజమాన్యం నార్తర్న్ సూపర్ చార్జర్స్ లో భాగస్వామ్యం అయింది. ఇదిలా ఉంటే.. సౌత్ ఆఫ్రికా టీ-20 లీగ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మరోసారి టైటిల్ రేసులో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ని చిత్తు చేసి.. క్వాలిఫైయర్ 2 కి అర్హత సాధించింది.

Also Read:  Champions Trophy 2025: శిఖర్ ధావన్ లేకపోవడం టీమిండియాకు ఎంత నష్టమో తెలుసా.. కోహ్లీ, రోహిత్ కూడా పనికిరారు !

కాగా 2023లో మొదలైన సౌత్ ఆఫ్రికా టీ-20 లీగ్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ {Sunrisers Hyderabad} కి చెందిన ఈస్టర్ను కేప్ జట్టు అరంగేట్ర ఛాంపియన్ గా నిలిచింది. గత సంవత్సరం కూడా మార్క్రమ్ కెప్టెన్సీ లోని ఈ జట్టు విజేతగా అవతరించి వరుసగా రెండవసారి టైటిల్ ని గెలుచుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి కూడా టైటిల్ ని గెలుచుకునేందుకు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టైటిల్ రేసులో నిలిచింది.

Related News

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Big Stories

×