Abhishek Sharma: ఇంగ్లాండ్ తో ఐదు టి-20 సిరీస్ లలో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ తొలి టి-20 లోనే భారత యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ విశ్వరూపం చూపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడడంతో.. ఇంగ్లాండ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 12.5 ఓవర్లలోనే అందుకుంది.
Also Read: Abhishek – Ball Exercise: 8 సిక్సులతో ఊచకోత.. అభిషేక్ బాల్ ఎక్సర్‌సైజ్ రహస్యం ఇదే?
కేవలం 34 బంతులలోనే 79 పరుగులతో ఊచకోత ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్సర్లు దంచి కొట్టాడు. ఈ తొలి టీ-20లో అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ క్రమంలో టి-20 ల్లో ఇంగ్లాండ్ పై భారత్ తరఫున రెండవ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు అభిషేక్. 2007 సెప్టెంబర్ 19న డర్బన్ వేదికగా ఇంగ్లాండ్ పై యువరాజ్ సింగ్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇంగ్లాండ్ పై సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండవ భారత బ్యాట్స్మెన్ గా నిలిచాడు అభిషేక్. అంతేకాదు కేఎల్ రాహుల్ 27 బంతులలో చేసిన హాఫ్ సెంచరీ రికార్డ్ ని బ్రేక్ చేశాడు. ఇదే కాక ఇంగ్లాండ్ జట్టుపై టి-20 ఇన్నింగ్స్ లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్ గా నిలిచాడు అభిషేక్. 2007 లో ఇంగ్లాండ్ జట్టుపై యువరాజ్ సింగ్ 6 సిక్సర్లు కొట్టగా.. 2022లో సూర్య కుమార్ యాదవ్ 6 సిక్సర్లు కొట్టాడు.
తాజాగా జరిగిన ఈడెన్ గార్డెన్స్ లో అభిషేక్ శర్మ ఏకంగా 8 సిక్సర్లు కొట్టి వారి రికార్డులను బ్రేక్ చేశాడు. 20 బంతులలో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ శర్మ తన సంబరాలను విభిన్నంగా జరుపుకున్నాడు. తన బొటనవేలు, చూపుడు వేలును పైకి చూపిస్తూ అభివాదం చేశాడు. ఇక అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చైర్ లోంచి లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు.
Also Read: Mohammad Amir: నీ అవ్వ తగ్గేదేలా…పాకిస్థాన్ క్రికెటర్ కు పూనకాలు తెచ్చిన పుష్ప 2 ?
ఎప్పుడు సీరియస్ గా కనిపించే గంభీర్.. అభిషేక్ శర్మ బ్యాటింగ్ కి ఫిదా అయ్యి చిరునవ్వులు చిందించాడు. ఈ తొలి టి-20లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో 12.5 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని సునాయాసంగా అందుకుంది.
TEAM INDIA BEAT ENGLAND IN FIRST T20I MATCH BY 7 WICKETS..!!!!
– A dominating Victory by Team India. 🇮🇳
INDIA CHASE DOWN 133 RUNS FROM JUST 12.5 OVERS..!!!!
Fastest 50s for Ind vs Eng in T20ls (balls faced)
12 Yuvraj Singh Durban 2007
20 Abhishek Sharma Kolkata 2025
27 KL… pic.twitter.com/DJc4YXDEvl
— AI Day Trading (@ai_daytrading) January 23, 2025