Abhishek – Ball Exercise: ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టి-20 సిరీస్ లో భాగంగా టీమ్ ఇండియా బోనీ కొట్టింది. భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్ బుధవారం రాత్రి కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయాన్ని నమోదు చేసింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో భారత ప్లేయర్లు ( Indian players) అద్భుతంగా రాణించారు.
Also Read: Mohammad Amir: నీ అవ్వ తగ్గేదేలా…పాకిస్థాన్ క్రికెటర్ కు పూనకాలు తెచ్చిన పుష్ప 2 ?
ఈ తొలి టి-20 లో టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్లను కోల్పోయి 132 పరుగులకు కుప్పకూలింది. భారత స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టగా.. పేస్ బౌలర్లు అర్షదీప్ సింగ్ 2, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు కూల్చారు. అనంతరం 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ ( Abhishek Sharma) అదరగొట్టాడు.
తన తుఫాన్ ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు అభిషేక్. కేవలం 34 బంతులలోనే 79 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు బాదాడు. క్రీజ్ లోకి వచ్చిన సమయం నుండే ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 20 బంతుల్లోనే హఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత మరింత దూకుడుగా ఆడి 34 బంతులలోనే 79 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
అయితే అభిషేక్ బ్యాటింగ్ కి రావడానికి ముందు బంతితో చేసిన ఎక్సర్సైజ్ {Abhishek – Ball Exercise} ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బంతి సీమ్ ను వివిధ పొజిషన్లలో చూస్తూ {Abhishek – Ball Exercise} చేసిన ఈ ప్రాక్టీస్.. అతడు బ్యాటింగ్ కి దిగిన తర్వాత చాలా ఉపయోగపడింది. దీంతో అభిషేక్ శర్మ కి సంబంధించిన ఈ బాల్ ఎక్సర్సైజ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Also Read: IND vs ENG 1st T20: దుమ్ములేపిన అభిషేక్ శర్మ.. టీమిండియా గ్రాండ్ విక్టరీ
ఇక భారత బ్యాటింగ్ లో ఓపెనర్ సంజు శాంసన్ 26 పరుగులు చేయగా.. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత.. తిలక్ వర్మ (19*), హార్దిక్ పాండ్యా (3*) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, ఆదిల్ రషీద్ 1 వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భారత జట్టు 5 మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య రెండో టి-20 మ్యాచ్ జనవరి 25వ తేదీన చెన్నైలోని ఏంఏ చిదంబరం స్టేడియంలో జరగబోతోంది.
ABHISHEK SHARMA: 20-ball fifty, 6 sixes, strike rate 255! 🤯🇮🇳
#INDvsENG pic.twitter.com/kN8PzuRL0N
— Over and out (@Over_and_out1) January 22, 2025