BigTV English

Sai Sudharsan : అరంగేట్ర మ్యాచ్ లోనే డకౌట్.. ఇంగ్లాండ్ పై టెస్ట్ లో టీమిండియా పరిస్థితి ఏంటి.. స్కోర్ వివరాలు ఇవే

Sai Sudharsan :  అరంగేట్ర మ్యాచ్ లోనే డకౌట్.. ఇంగ్లాండ్ పై టెస్ట్ లో టీమిండియా పరిస్థితి ఏంటి.. స్కోర్ వివరాలు ఇవే

Sai Sudharsan :   ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ఓపెనర్ గా సాయి సుదర్శన్ అద్భుతంగా రాణించాడు. దీంతో అతను టీమిండియా టెస్ట్ సిరీస్ జట్టుకి ఎంపికయ్యాడు. ఇవాళ జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో సాయి సుదర్శన్ డకౌట్ గా వెనుదిరిగాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యూహానికి బోల్తా కొట్టాడు సాయి సుదర్శన్. స్టోక్స్ ప్లాన్ చేసి మరీ వికెట్ తీయడం విశేషం. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా లంచ్ బ్రేక్ కి ముందు టీమిండియా వరుసగా కే.ఎల్.రాహుల్, సాయి సుదర్శన్ వికెట్లను కోల్పోయింది.  ఓపెనర్ కే.ఎల్. రాహుల్ 42 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సాయి సుదర్శన్ మాత్రం తన తొలి టెస్ట్ మ్యాచ్ లో డకౌట్ కావడం కాస్త బాధకరం అనే చెప్పాలి.


Also Read :  Andrew Symonds : సైమాండ్స్ కు చేత కాలేదు.. బుడ్డోడికి ఫీల్డింగ్ ఇచ్చాడు

ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా హెడింగ్లీ లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తో సాయి సుదర్శన్ టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన కెరీర్ లో మొదటి మ్యాచ్ కావడం.. అది ఇంగ్లాండ్ తో కావడంతోనే ఏమో కాస్త తడబడ్డాడు సాయి సుదర్శన్. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేసిన ప్లాన్ కి తన వికెట్ ను సమర్పించుకున్నాడు. కేవలం నాలుగు బంతులు మాత్రమే ఆడి పరుగులు చేయకుండా వెనుదిరిగాడు. ముఖ్యంగా ఓపెనర్ కే.ఎల్.రాహుల్ ఔట్ అయిన తరువాత సాయి సుదర్శన్ ఫస్ట్ డౌన్ లో క్రీజులోకి వచ్చాడు. లంచ్ బ్రేక్ సమయానికి ఒక్క ఓవర్ ముందు క్రీజులోకి రావడంతో.. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సాయిని ఎలాగైనా సరే ఔట్ చేయాలని పన్నాగం పన్నాడు. 25వ ఓవర్ చివరి బంతికి స్ట్రయికింగ్ లోకి రాగానే స్లిప్ తో పాటు లెగ్ వికెట్ అవతల కూడా ఇద్దరూ ఫీల్డర్స్ పెట్టాడు స్టోక్స్.  25వ ఓవర్ లో చివరి బంతిని బ్రైడన్ కార్స్ లెగ్ వికెట్ మీదుగా వేయగా అది డాట్ అయింది. ఇక 26వ ఓవర్ లో బంతిని అందుకున్న స్టోక్స్ పక్కా ప్లాన్ తో ఫీల్డింగ్ సెట్ చేశాడు.


సాయి సుదర్శన్ వికెట్ ని టార్గెట్ చేస్తూనే బౌలింగ్ చేసాడు. తొలి బంతిని జైస్వాల్ సింగిల్ తీయగా.. రెండో బంతికి సాయి సుదర్శన్ స్ట్రైకింగ్ కి వచ్చాడు. రెండో బంతిని మిడ్ వికెట్ మీదుగా వేయగా.. అది హెడ్జ్ తీసుకొని స్లిప్ లోకి వెళ్లింది. మూడో బంతిని లెగ్ వికెట్ మీదుగా వేయగా ఫ్యాడ్ కి తగిలి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. నాలుగో బంతిని లెగ్ వికెట్ బయటకు వేయగా.. సాయి సుదర్శన్ బ్యాట్ కి టచ్ అయి నేరుగా వికెట్ కీపర్ చేతిలో పడింది. దీంతో సాయి సుదర్శన్ డకౌట్ గా వెనుదిరిగాడు.  గత 40 ఇన్నింగ్స్ లో కేవలం ఒకే ఒక్కసారి డకౌట్ అయ్యాడు. అది కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనే కావడం గమనార్హం. తన తొలి టెస్ట్ మ్యాచ్ లోనే సాయి సుదర్శన్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం 38 ఓవర్లలో టీమిండియా 158 /2 పరుగులు చేసింది. ఓపెనర్ జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం విశేషం.

https://twitter.com/OneCricketApp/status/1936047395348914365?t=umcaa1V6ZGww_YyaZW9f3A&s=08

Related News

Cristiano Ronaldo :పెళ్లికి ముందే 4 గురు పిల్లలు ఉన్నారా.. బయటపడ్డ రోనాల్డో భాగోతం!

Arjun Tendulkar: రహస్యంగా సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Dinda Academy Trolls : Dinda Academy అని ఎందుకు ట్రోలింగ్ చేస్తారు..?

Nithish Kumar Reddy : మహేష్ కోసం త్యాగం.. కొత్త టాటూలతో రెచ్చిపోయిన నితీష్ కుమార్ రెడ్డి

Rashid Khan : సరికొత్త షాట్ కనిపెట్టిన రషీద్ ఖాన్… చరిత్రలో నిలిచి పోవడం గ్యారెంటీ

Grace Hayden on Pant: రిషబ్ పంత్ పై ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురు మోజు.. బోల్డ్ కామెంట్స్ వైరల్ !

Big Stories

×