BigTV English

OTT Movie : ప్రాణాలు పోయే టైంలో ఏఐని నమ్ముకుంది… మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ప్రాణాలు పోయే టైంలో ఏఐని నమ్ముకుంది… మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : సినీ ప్రియులకు ఓటీటీ ఒక వరంగా మారింది. కావాల్సిన కంటెట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. అయితే వీటిలో సైన్స్ ఫిక్షన్ సినిమాలు, కొత్త కొత్త టెక్నాలజీ తో మతి పోగొడుతున్నాయి. ఈ మథ్య, ఈ జనర్లో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అదే విధంగా ప్రేక్షకులు కూడా ఇటువంటి సినిమాలను ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, AI ఒక ఒంటరి మహిళను చాలా ఇబ్బంది పెడుతుంది. ఉత్కంఠభరితంగా ఈ స్టోరీ సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఐ విల్ బి వాచింగ్’ (I’ll Be Watching). 2023 లో విడుదలైన ఈ సినిమాకి ఎరిక్ బెర్నార్డ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఎలిజా టేలర్, బాబ్ మోర్లీ, సేథ్ మైఖేల్స్, డేవిడ్ కీత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ జూలీ అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన సోదరి మరణం నుండి బాధపడుతూ, కొత్త ఇంట్లో ఒంటరిగా జీవిస్తుంది. ఆ తరువాత అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

జూలీ తన సోదరి రెబెక్కా మరణం తర్వాత బాధతో కొట్టుమిట్టాడుతోంది. రెబెక్కా మరణం జూలీ, ఆమె భర్త మార్కస్ మునుపటి ఇంటిలో ఒక ఇంట్రూడర్ దాడి సమయంలో, మార్కస్ రూపొందించిన AI భద్రతా వ్యవస్థ పనిచేయకపోవడం వల్ల సంభవించింది. ఈ ఘటన జూలీని మానసికంగా బాధపెడుతుంది, ఆమె దీని వల్ల మాదక ద్రవ్యాలు, మద్యానికి బానిస అవుతుంది. ఇక మార్కస్ ఒక టెక్ జీనియస్. హాంకాంగ్‌లో ఒక బిజినెస్ టూర్ కి వెళ్ళినప్పుడు, జూలీని ఒక కొత్త హై-టెక్, ఐసోలేటెడ్ ఇంటిలో ఒంటరిగా వదిలి వెళతాడు. మార్కస్ వెళ్ళిన తర్వాత, జూలీ ఇంటిలో వింత సంఘటనలను ఎదుర్కొంటుంది. ఇంటి AI వ్యవస్థ లైటింగ్, డోర్ లాక్‌లు, భద్రతా కెమెరాలను నియంత్రిస్తుంది. ఇది  అసాధారణంగా ప్రవర్తిస్తుంది.

జూలీకి ఇంటిలో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆమె మానసిక స్థితి వల్ల జరుగుతున్నవి ఊహలా లేదా వాస్తవమా అని నిర్ధారించుకోలేకపోతుంది. ఆమె భయంతో వీటిని ఎదుర్కుంటూ, ఇంటి టెక్నాలజీ ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు భావిస్తుంది. ఆమె బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోయి, ఈ హై-టెక్ ఇంటిలో చిక్కుకుంటుంది. ఈ AI బెడ్రూం లోకి వచ్చి వింతగా ప్రవర్తిస్తుంది. కథ ముందుకు సాగేకొద్దీ, జూలీ తన భయాలను ఎదుర్కొంటూ బతకడానికి పోరాడాల్సి వస్తుంది. ఆమె తన స్వంత తెలివిని ఉపయోగించి ఈ పరిస్థితిని అధిగమించాల్సి వస్తుంది. ఇక ఈ సినిమా ఒక ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌తో ముగుస్తుంది. చివరికి జూలీ AI ఉచ్చులో నుంచి బయటపడుతుందా ? AI నుంచి ఎటువంటి సమస్యలు వస్తాయి ? క్లైమాక్స్‌ లో వచ్చే ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : నడిరాత్రి నదిలో దేవకన్యల స్నానం… ఒంటరిగా చూస్తే పక్క తడిచిపోవాల్సిందే మావా

Related News

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

OTT Movie : ఈ సైకో చేతికి అమ్మాయి దొరికితే అరాచకమే… వదలకుండా అదే పని… గూస్ బంప్స్ తెప్పించే కథ

OTT Movie : దొంగతనం చేసే పిల్లి… థ్రిల్లింగ్ ట్విస్టులు… ఊహించని సర్ప్రైజ్ లతో థ్రిల్ ఇచ్చే మలయాళ మూవీ

OTT Movie : పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన ఏజ్ లో వేషాలేస్తే ఇదే గతి

OTT Movie : మిస్టీరియస్ ప్లేస్ లో అమ్మాయి ట్రాప్… ఒక్కో ట్విస్ట్ కు మతి పోవాల్సిందే

OTT Movie : హెయిర్ కట్ కోసం ఇదెక్కడి అరాచకం సామీ… మనసును కదిలించే కన్నడ మూవీ

Big Stories

×