BigTV English

Yogandhra : యోగాంధ్ర గిన్నిస్ రికార్డ్.. విశాఖలో మెగా ఈవెంట్

Yogandhra : యోగాంధ్ర గిన్నిస్ రికార్డ్.. విశాఖలో మెగా ఈవెంట్

Yogandhra : 25 వేల మంది గిరిజన స్టూడెంట్స్. 108 నిమిషాలు. 108 సూర్య నమస్కారాలు. విశాఖలో జరిగిన మెగా యోగా ఈవెంట్ గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్బంగా అల్లూరు జిల్లా విద్యార్థులను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారని.. ఒక్క పిలుపుతో ప్రపంచం మొత్తం ఏపీ వైపే చూసేలా చేశారని అన్నారు. యోగా కేవలం ఆసనాలు మాత్రమే కాదు క్రమశిక్షణ నేర్పే విధానం అని తెలిపారు. కలలు కనండి.. కష్టపడి పట్టుదలతో కృషి చేయండి అని విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. ఈ స్కూల్ పిల్లలందరినీ చూస్తుంటే దేవాన్ష్ గుర్తుకు వస్తున్నాడని.. మీలో ఉన్న క్రమశిక్షణ, పట్టుదలను దేవాన్ష్‌కు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు నారా లోకేశ్. జూన్ 21 తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు యోగా చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


యోగాంధ్రకు గెట్ రెడీ

మరోవైపు, జూన్ 21, శనివారం.. యోగాంధ్ర పేరుతో 5 లక్షల మందితో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పబోతోంది ఏపీ. ప్రధాని మోదీ స్వయంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. 26 మంది ప్రముఖ యోగా గురువులు.. 1500 మంది శిక్షకులు.. 6300 మంది వాలంటీర్లు.. యోగాంధ్రను పర్యవేక్షించనున్నారు. 11 యుద్ధ నౌకలపై యోగా సాధన చేస్తారు.


రూ.62 కోట్లతో భారీ ఏర్పాట్లు

ఆర్కే బీచ్ కేంద్రంగా.. విశాఖ తీరంలో 34 కి.మీల మేర యోగా ఈవెంట్ జరగబోతోంది. బీచ్ రోడ్డులో మొత్తం 326 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశారు. ప్రతి 40 అడుగులకు ఒక చిన్న వేదిక ఉంటుంది. యోగా ఈవెంట్‌లో పాల్గొనేవారికి ముందుగానే రిజిస్ట్రేషన్ చేస్తారు. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. పార్టిసిపేట్స్ అందరికీ ఉచితంగా యోగా మ్యాట్, టీ షర్టు అందజేస్తారు. దాదాపు రూ.62 కోట్ల బడ్జెట్‌తో యోగాంధ్రకు భారీ ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం.

వేలాది బస్సులు.. తాత్కాలిక ఆసుపత్రులు

ప్రజల తరలింపు కోసం 3,600 ఆర్టీసీ బస్సులు.. 7,295 ప్రైవేటు బస్సులు సిద్ధం చేశారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయి. 3 వేల తాత్కాలిక మరుగుదొడ్లు.. ప్రతీ 5 కంపార్ట్‌మెంట్‌లకు ఒక వైద్య శిబిరం.. ప్రధాన వేదిక దగ్గర 10 పడకల తాత్కాలిక ఆసుపత్రి రెడీ చేశారు.

Also Read : చంద్రబాబుతో రేవంత్‌రెడ్డి చర్చలు! మార్పు మంచిదేగా..

టైట్ సెక్యూరిటీ..

ప్రధాని మోడీ రాకతో 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. బీచ్ రోడ్డు వెంబడి 2 వేల సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. యోగాంధ్రతో గిన్సిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొప్పి.. ఏపీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగేలా విశాఖలో సకలం సిద్ధం.

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×