Andrew Symonds : సాధారణంగా ఆస్ట్రేలియా జట్టు క్రికెట్ లో ఎంత ప్రతిభవంతమైన జట్టో దాదాపు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోనే క్రికెట్ పుట్టిందని చెబుతుంటారు. ఆస్ట్రేలియా జాతీయ క్రీడ కూడా క్రికెట్ కావడం విశేషం. ఇక తొలుత ఆస్ట్రేలియా జట్టు వన్డే వరల్డ్ కప్ 1987లో సాధించింది. ఇక ఆ తరువాత 1999లో, 2003లో, 2007లో హ్యాట్రిక్ వరల్డ్ కప్ సాధించి రికార్డు సృష్టించింది. అలాగే 2000లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2006లో ఛాంపియన్ ట్రోఫి, 2009 ఛాంపియన్ ట్రోఫీ కూడా సాధించింది. 2015లో వన్డే వరల్డ్ కప్, 2021 టీ-20 వరల్డ్ కప్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లను గెలుచుకుంది. అలాగే 2023 వన్డే వరల్డ్ కప్ సాధించింది ఆస్ట్రేలియా జట్టు. ప్రపంచంలో ఏ జట్టు కూడా ఇన్ని సార్లు టైటిల్ సాధించలేదంటే ఆస్ట్రేలియా టీమ్ క్రికెట్ ఎలా ఆడుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Also Read : Jio vs Sony : గంగలో కలిసిన జియో పరువు.. సోనీ స్కోర్ బోర్డునే కాపీ చేశారుగా!
ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టు రికీ పాంటింగ్ కెప్టెన్సీలో రెండు వరల్డ్ కప్ లు , 1 ఛాంపియన్ ట్రోఫీ సాధించడం విశేషం. వాస్తవానికి 2007 ప్రపంచ కప్ కి ముందు ఆస్ట్రేలియా జట్టు 420 పరుగులు చేస్తే.. సౌతాఫ్రికా జట్టు వాటిని ఛేదించింది. ఆడమ్ గిల్ క్రిస్ట్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో శ్రీలంకను చిత్తు చేసి విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు వేసవికి ముందు రిటైర్డ్ స్టార్స్ తో ఆల్-స్టార్ XIని ఆడుతుంది. నవంబర్ 2008లో అలాంటి ఒక గేమ్ సమయంలో ఆండ్రూ సైమండ్స్ ఫీల్డింగ్ చేయకుండా తన బదులు ఇద్దరు కుర్రాలతో ఫీల్డింగ్ చేయించాడు. ఆస్ట్రేలియన్ XI కోసం ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సైమండ్స్ అతని స్థానంలో టామ్ అనే యువకుడిని అనుమతించాడు. కొద్ది నిమిషాల తరువాత సైమండ్స్ మరో అబ్బాయిని బౌండరీ పక్కన ఉంచాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Also Read : Thaman – CSK : CSK లోకి టాలీవుడ్ స్టార్.. ఇక దబిడి దిబిడే !
సైమండ్స్ 2012లో అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. సైమండ్స్ 26 టెస్టులు ఆడి.. 1462 పరుగులు చేశాడు. 198 వన్డే మ్యాచ్ లు ఆడి 5,088 పరుగులు పూర్తి చేశాడు. అటు 14 టీ-20 మ్యాచ్ ల్లో 337 పరుగులు చేసాడు. సైమండ్స్ ఖాతాలో టెస్టుల్లో 2 సెంచరీలతో పాటు 10 హాఫ్ సెంచరీలు, వన్డేల్లో 6 సెంచరీలతో పాటు 30 హాఫ్ సెంచరీలున్నాయి. సైమండ్స్ డెక్కన్ ఛార్జర్స్ తరపున బరిలోకి దిగాడు. మూడు సీజన్ల వరకు డెకన్ ఛార్జర్స్ కి ఆడిన అతను.. ఆ తరువాత ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఆ రెండు జట్ల తరపున 974 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ వేలంలో తనకు భారీ ధర పలకడంతో క్లార్క్ తో తన ఫ్రెండ్ షిప్ చెడిపోయిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. మరోవైపు 2008లో టీమిండియా బౌలర్ హర్భజన్ సింగ్ తో సైమండ్స్ కి మంకీ గేట్ వివాదం తలెత్తింది. అప్పట్లో అది సంచలనం అయింది.
?igsh=dG9pd3Vycjk2OThu