E-Paper
Advertisement

IND vs ENG 2nd Test : ఇలాగైతే ఎవడు ఆడతాడు.. బ్యాట్ పడేసిన బెన్ స్టోక్..!

IND vs ENG 2nd Test : ఇలాగైతే ఎవడు ఆడతాడు.. బ్యాట్ పడేసిన బెన్ స్టోక్..!
Ben Stokes Dismissal Video

Ben Stokes Dismissal Video : టీమ్ ఇండియా అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో, అటు ఫీల్డింగ్ లో ఇరగదీసింది. రెండో టెస్ట్ రెండో రోజు మ్యాచ్ లో మాత్రం హీరో ఎవరంటే బుమ్రా అనే చెప్పాలి. తొలిరోజు బ్యాట్ తో యశస్వి నడిపిస్తే, రెండోరోజు బాల్ తో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నిలబెట్టాడు. ఇంగ్లాండ్ ని 253 పరుగల వద్ద ఆపాడు. మ్యాచ్ లో 6 వికెట్లు తీసి అద్భుతం చేశాడు. టీమ్ ఇండియాకి 143 పరుగుల ఆధిక్యాన్ని అందజేశాడు.

అయితే బూమ్రా బౌలింగ్ లో ఆసక్తికరమైన ఘటనలు జరిగాయి. 49 ఓవర్ జరుగుతోంది. ఇంగ్లాండ్ స్కోరు అప్పటికి 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు. స్ట్రయికింగ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ ఉన్నాడు. బుమ్రా రెండో బంతి సంధించాడు. బెన్ స్టోక్ డిఫెన్స్ ఆడుదామని బ్యాట్ అడ్డం పెట్టాడు. కానీ బంతి పక్కనుంచి వెళ్లినట్టు వెళుతూ, తన బ్యాట్ ని దాటి, తర్వాత ఇన్ స్వింగ్ అయి, వికెట్ ని ఒక్క దెబ్బకి గిరాటేసింది.

అంతే బెన్ స్టోక్ ఒక్కసారి స్టన్ అయిపోయాడు. ఇలాంటి బౌలింగ్ వేస్తే, ఎవడు ఆడతాడు? అంటూ బ్యాట్ ని అక్కడే కిందకి విసిరేశాడు. మళ్లీ తేరుకుని, తన బ్యాట్ తీసుకుని పెవిలియన్ కి చేరుకున్నాడు. మొత్తానికి రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన బెన్ స్టోక్, బుమ్రా బౌలింగ్ దెబ్బకి అవుట్ అయిపోయాడు.

ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. తొలి టెస్ట్ లో 196 పరుగులు చేసి, టీమ్ ఇండియాకి విజయాన్ని దూరం చేసిన ఒలిపోప్ ని కూడా బూమ్రా బోల్తా కొట్టించాడు. 28వ ఓవర్‌లో ఇది జరిగింది. ఐదో బంతిని అద్బుతమైన ఇన్‌స్వింగర్‌ తో యార్కర్‌గా సంధించాడు. బంతిని అడ్డుకునేందుకు పోప్‌ విఫలయత్నం చేశాడు. కానీ క్షణంలో వెయ్యో వంతులో బంతి వెళ్లి వికెట్లను లేపేసింది. ఇది చూసి షాక్ అవడం పోప్ వంతు అయింది.

బుమ్రా బాల్ కి వికెట్లు రెండు ఎగిరిపడ్డాయి. అవి ఎగిరి పడటమే కాదు…గ్రౌండ్ లో మూడు మొగ్గలేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్టు చేయగా.. అది వైరల్‌గా మారింది.

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×