MI New York: మేజర్ లీగ్ క్రికెట్ {MLC} 2025 ఎన్నో ట్విస్ట్ లతో ఫైనల్ వరకు వచ్చిన విషయం తెలిసిందే. లీగ్ దశలోనే ఇంటి బాట పడుతుందనుకున్న ఎంఐ న్యూయార్క్ {MI New York}.. ఏకంగా ఫైనల్స్ లో అడుగుపెట్టింది. మొదటినుండి నిలకడగా రాణిస్తూ వచ్చిన టెక్సాస్ సూపర్ కింగ్స్ చాలెంజర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిని చవిచూసింది. దీంతో ఈ నెల 14న జరిగిన ఫైనల్స్ లో వాషింగ్టన్ ఫ్రీడమ్ తో ఎంఐ న్యూయార్క్ జట్టు తలపడింది. ఈ ఫైనల్ మ్యాచ్ మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ గా సాగింది.
Also Read: Goldberg Retirement: WWE గోల్డ్ బెర్గ్ సంచలన నిర్ణయం..షాక్ లో ఫ్యాన్స్
ఫైనల్స్ లో ఎంఐ న్యూయార్క్ విజయం:
ఫైనల్ లో ఎంఐ న్యూయార్క్ జట్టు విజయం సాధించింది. దీంతో యుఎస్ లో జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ 2025 విజేతగా MI న్యూయార్క్ {MI New York} నిలిచింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుతో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లను నష్టానికి 180 పరుగులు చేసింది.
ముంబై బ్యాటర్లలో.. డికాక్ 77, మోనాక్ పటేల్ 28, పూరన్ 21, సింగ్ 22 పరుగులు చేశారు. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 3, నెట్రవల్కర్ 1, మ్యాక్స్ వెల్ 1, ఎడ్వర్డ్స్ 1, హాలండ్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు 19వ ఓవర్ వరకు బాగానే ఆడింది. ఇక చివరి ఓవర్ లో 12 పరుగులు చేయాల్సి ఉండగా.. కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసింది. ఇలా చివరి వరకు ఉత్కంఠ గా తాగిన ఈ మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో ఓడిపోయి.. టైటిల్ ని కోల్పోయింది. ఈ విజయంతో ఎంఐ న్యూయార్క్ మేజర్ లీగ్ క్రికెట్ లో రెండో టైటిల్ ని కైవసం చేసుకుంది.
వాషింగ్టన్ ఫ్రీడమ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర 70, గ్లేన్ ఫిలిప్స్ 48* పరుగులు చేశారు. ఇక ఎంఐ న్యూయార్క్ బౌలర్లలో బౌల్డ్, రుషిల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కాగా ఈ విజయంతో టి-20ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ విజయయాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఐపీఎల్, డబ్ల్యూపిఎల్, ఇంటర్నేషనల్ లీగ్ టి-20, సౌత్ ఆఫ్రికా 20, మేజర్ క్రికెట్ లీగ్ లోనూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ ఫ్రాంచైజీ ఖాతాలో ఇప్పటివరకు 13 ట్రోఫీలు చేరడమే దీనికి నిదర్శనం. దీంతో టి-20ల్లో గ్రేటెస్ట్ ఫ్రాంచైజీ ఇదేనంటూ క్రీడాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎమ్ఐ న్యూయార్క్ విజయంతో ముంబై అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.