New Governor: దేశంలో పలు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించింది. మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ నియామకాలను ఆమోద ముద్ర వేశారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తా, గోవా గవర్నర్ గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు, హర్యానా గవర్నర్ గా ఆషిం కుమార్ ఘోష్ లను నియమించినట్టు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఏపీకి చెందిన అశోక్ గజపతి రాజు టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు. ఎన్డీఏ గవర్నమెంట్ లో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. రాజకీయంలో మంచి అనుభవం ఉన్న అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్‌గా నియమిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. పీఎస్ శ్రీధరన్ పిల్లై స్థానంలో ఆయనను గోవా గవర్నర్ గా కేంద్రం నియమించింది. విజయనగరం రాజ వంశానికి చెందిన ఆయన 1951 లో జన్మించారు. ఆయన తండ్రి పేరు పూసపాటి విజయరామ గజపతి రాజు. ఇతను విజయనగరం సంస్థానపు చివరి మహారాజు. చదువు పూర్తి అయిన వెంటనే అశోక్ గజపతి రాజు రాజకీయం రంగంలోకి ప్రవేశించారు.
1983లో ఆయన టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఏడుసార్లు ఎమ్మెల్యేగా (1983, 1985, 1989, 1994, 1999, 2009, 2014) గెలిచారు. 2014లో ఎంపీగా కూడా గెలిచారు. బీజేపీ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే గతంలో ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎక్సైజ్, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఫైనాన్స్ లాంటి శాఖలకు మంత్రిగా పనిచేశారు. అంతేగాక, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా సేవలు అందించారు. 2020లో ఆయనను ఈ పదవుల నుంచి తొలగించినప్పటికీ.. 2021లో హైకోర్టు ఉత్తర్వులతో మళ్లీ బాధ్యతలు చేపట్టారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ గజపతి రాజు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. ఆయన కుమార్తె పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతి రాజు తెలుగుదేశం పార్టీ తరఫున విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆమె ఈ ఎన్నికల్లో 60వేలకు పైగా మెజార్టీతో గెలిపొందారు. దీంతో గజపతి రాజు కుటుంబం రాజకీయ వారసత్వం కొనసాగుతోంది.
ALSO READ: Train accident: తిరుపతి రైలులో భారీగా మంటలు.. బోగీలు బుగ్గి