BigTV English
Advertisement

Siraj – Diogo Jota : ఇంగ్లాండ్ ను వణికించిన సిరాజ్.. వేళ్ళతో ఆ సిగ్నల్స్ ఇస్తూ.. వీడియో వైరల్

Siraj – Diogo Jota : ఇంగ్లాండ్ ను వణికించిన సిరాజ్.. వేళ్ళతో ఆ సిగ్నల్స్ ఇస్తూ.. వీడియో వైరల్

 Siraj – Diogo Jota :   ఫుట్ బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లివర్ పూల్ జట్టు తరపున ఆడే ప్రఖ్యాత పోర్చుగీస్ ఫుట్ బాల్ ప్లేయర్ డియాగో జోట {28}  కారు ప్రమాదంలో మృతి చెందారు. స్పెయిన్ లోని జమేరాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో అతడి సోదరుడు ఆండ్రే ఫిలెపి {26} కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పోర్చుగల్ లోని ఫెనాఫిల్ కి చెందిన డియోగో జోట, తన సోదరుడు ఆండ్రీ తో కలిసి ట్రావెల్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు ప్రమాదానికి గురైన వెంటనే ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల ధాటికి చుట్టుపక్కల ప్రాంతం కూడా ఎఫెక్ట్ అయినట్టు స్థానికులు చెబుతున్నారు. జులై 3 న రాత్రి A-52 హైవేలో 65వ కిలోమీటర్ వద్ద వారు ప్రయాణిస్తున్న కారకు ప్రమాదం జరిగింది.


Also Read : Watch Video : ఏంట్రా ఈ దరిద్రం.. ఇలా కూడా ఔట్ అవుతారా.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

డియోగో జోటా కి సిరాజ్ నివాళి.. 


తాజాగా టీమిండియా క్రికెటర్ సిరాజ్.. కారు ప్రమాదంలో మరణించిన ఫుట్ బాల్ ప్లేయర్  డియోగో జోటా కి హృదయ పూర్వక నివాళి అర్పించారు. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆడుతున్న సిరాజ్, జెమీ స్మిత్ వికెట్ తీసిన తరువాత తన వేళ్లతో నెంబర్ 20 అని సైగ చేస్తూ సంబురాలు చేసుకున్నాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో 107వ ఓవర్ లో త తొలి వికెట్ ను తీయడంతో సిరాజ్ సంబురాలు జరుపుకున్నాడు. స్మిత్, ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సే మధ్య 84 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. మరోవైపు స్మిత్, కార్స్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్ జట్టు 112.3 ఓవర్లకు  387 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోరూట్ (104)తో రాణించాడు. ఓలీపోప్, బెన్ స్టోక్స్ 44, జెమీ స్మిత్ 51, బ్రైడన్ కార్స్ 56 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5, నితిశ్ కుమార్ రెడ్డి 2, సిరాజ్ 2, రవీంద్ర జడేజా 1 వికెట్ తీసుకున్నారు.

ఇన్నింగ్స్ లో ఆసక్తికర ఘటన.. 

లార్డ్స్ వేదికగా జరిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఫీల్డర్ రవీంద్ర జడేజా వద్దకు బంతి వెల్లిందంటే పరుగు తీసేందుకు బ్యాటర్లు జంకుతుంటారు. సింగిల్ అంటే పర్వాలేదు.. కానీ రెండో రన్ కోసం వెళ్లితే రనౌట్ ఖాయం. బ్యాటర్లను ఉడికించడంలోనూ జడేజా చాలా ముందుంటాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్ట్ లో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అది కూడా తొలి రోజు ఆట చివరి ఓవర్ లో కావడం విశేసం. ఇంగ్లాండ్ జట్టు తొలి రోజు 251/4 స్కోర్ తో ముగించింది. క్రీజులో జో రూట్ (99), బెన్ స్టోక్స్ (39) ఉన్నారు. చివరి ఓవర్ ను ఆకాశ్ దీప్ వేశాడు. అప్పుడు రూట్ 98 పరుగుల వద్ద ఉన్నాడు. బ్యాక్ వర్డ్ పాయింట్ వైపు బంతిని పంపించాడు. అక్కడ జడేజా ఉన్నాడు. సింగిల్ తీసిన రూట్ మరో పరుగు తీస్తే.. సెంచరీ పూర్తి అవుతుందనే ఉద్దేశంతో సిద్ధమయ్యాడు. కానీ స్టోక్స్ అంత ఆసక్తిగా లేడు. అప్పటికే సగం క్రీజు వరకు వచ్చిన రూట్ వెనక్కి వెళ్తుండగా.. అతడిని ఆట పట్టించేలా జడేజా బంతిని విసరకుండా జారవిడిచినట్టు పడేసి పరుగు తీసుకో అన్నట్టు సైగలు చేశాడు. రూట్ కి ఆశ కలిగిందేమో పరుగు తీద్దామని మళ్లీ ముందుకు వెళ్లాడు. కానీ స్ట్రైకింగ్ లో ఉన్న స్టోక్స్ వద్దని చెప్పడంతో ఆగిపోయాడు.

Related News

Asia Cup 2025: టీమిండియా ప్లేయ‌ర్లు టెర్ర‌రిస్టులు…అందుకే ట్రోఫీ ఇవ్వ‌లేదు..!

Asia Cup 2025: మోహ్సిన్ నఖ్వీ దొంగ‌బుద్ది..ఆ ర‌హ‌స్య ప్ర‌దేశంలో ఆసియా క‌ప్ దాచేసి, కుట్ర‌లు

Gautam Gambhir: గిల్ కు షాక్‌.. త‌న‌పైకి విమ‌ర్శ‌లు రాకుండా గంభీర్ స్కెచ్‌.. ఏకంగా రూ. 49 కోట్లు పెట్టి !

Womens World Cup 2025 Semis: వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ షెడ్యూల్ ఖ‌రారు..ఆ జ‌ట్టుతోనే టీమిండియాకు మ్యాచ్‌..పూర్తి వివ‌రాలు

Hardik Pandya: పిన్నితో నటషా కొడుకు…గాయం పేరుతో బీసీసీఐని మోసం చేస్తున్న హార్దిక్ పాండ్య

Simon Harmer: పాకిస్తాన్ ఓ అందమైన దేశం, అక్క‌డ ఉగ్ర‌వాదులే లేరు…స‌న్ రైజ‌ర్స్ ప్లేయ‌ర్‌ షాకింగ్ కామెంట్స్‌!

Gautam Gambhir: కుల్దీప్ ఏం త‌ప్పు చేశాడు..ఓట‌మికి మూల‌ కార‌ణం గంభీరే, టీమిండియా 5 సిరీస్ లు గోవిందా

Yuzvendra Chahal: విడాకులు తీసుకున్న మ‌హిళ‌ల‌కు భ‌ర‌ణం ఇవ్వొద్దు… చాహ‌ల్ సంచ‌ల‌నం పోస్ట్‌

Big Stories

×