BigTV English
Advertisement

OTT Movie : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సరికొత్త మలయాళ మర్డర్ మిస్టరీ… క్రైమ్ తో పాటే కామెడీ కూడా…

OTT Movie : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సరికొత్త మలయాళ మర్డర్ మిస్టరీ… క్రైమ్ తో పాటే కామెడీ కూడా…

OTT Movie : మలయాళం సినిమాలకు ఇప్పుడు బాగా క్రేజ్ ఏర్పడింది. మంచి కంటెంట్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, నేరాలు జరగని ఒక గ్రామంలో ఒక సైకో కిల్లర్ అలజడి సృష్టిస్తాడు. ఆ తరువాత స్టోరీ ఒక రేంజ్ లో నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ కామెడీ మూవీ పేరు ‘డిటెక్టివ్ ఉజ్జ్వలన్’ (Detective ujjwalan). 2025లో విడుదలైన ఈ మలయాళ మూవీకి ఇంద్రనీల్ గోపీకృష్ణన్, రాహుల్ జి. దర్శకత్వం వహించారు. దీనిని వీకెండ్ బ్లాక్‌బస్టర్స్ బ్యానర్‌పై సోఫియా పాల్ నిర్మించారు. ఈ చిత్రంలో ధ్యాన్ శ్రీనివాసన్, సిజు విల్సన్, రోనీ డేవిడ్ రాజ్, కొట్టాయం నజీర్, సీమా జి. నాయర్, అమీన్, నిహాల్ నిజామ్, నిబ్రాజ్ నౌషాద్, షాహుబాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా స్టోరీ 1990లలో కేరళలోని ప్లాచ్చిక్కావు అనే ఒక గ్రామంలో జరుగుతుంది. 2025 జూలై 11 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

కేరళలోని ప్లాచ్చిక్కావు అనే ఒక శాంతియుతమైన గ్రామం ఉంటుంది. ఉజ్జ్వలన్ (ధ్యాన్ శ్రీనివాసన్) ఒక విచిత్రమైన, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్న గ్రామ డిటెక్టివ్. అతను రోజువారీగా ఒక లైబ్రరీని నడుపుతుంటాడు. ఈ లైబ్రరీ ఎక్కువగా డిటెక్టివ్ నవలలతో నిండి ఉంటుంది. అతను గ్రామంలో చిన్న చిన్న నేరాలను (పోగొట్టుకున్న బంగారం, తప్పిపోయిన మేకలను) ను పరిష్కరిస్తుంటాడు. స్థానిక పోలీసులు అసమర్థంగా ఉండటం వల్ల, ఉజ్జ్వలన్ ఈ చిన్న నేరాలను పరిష్కరించడంలో వారికి సహాయం చేస్తాడు. అయితే ఉజ్జ్వలన్ కు పెళ్ళి వయసు దాటిపోతున్నా ఇంకా బ్యాచిలర్ గానే ఉంటాడు. అతనికి ఉన్న నిరుద్యోగ పరిస్థితి కారణంగా పెళ్ళి ప్రయత్నాలు కూడా బెడిసికొడతాయి. ఇంతలో ఒక సీరియల్ కిల్లర్ ప్లాచ్చిక్కావు గ్రామాన్ని అతలాకుతలం చేస్తాడు. అతను “బూగీమాన్” అని పిలువబడే ఒక ముసుగు ధరించిన వ్యక్తి. రాత్రిపూట ఒంటరిగా నడిచే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తాడు.

ఈ హత్యలు గ్రామంలో భయాందోళనలను సృష్టిస్తాయి. ఉజ్జ్వలన్ చిన్న చిన్న నేరాలను పరిష్కరించే నైపుణ్యాలు, ఈ కేసుకు సరిపోవని అనిపిస్తుంది. అందుకే అతని ప్రయత్నాలను మొదట్లో గ్రామస్థులు, పోలీసులు పెద్దగా పట్టించుకోరు. ఈ సమయంలో, ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం, CI శంభు మహాదేవ్ (సిజు విల్సన్) నాయకత్వంలో, కేసును పరిశోధించడానికి వస్తుంది. మరోవైపు ఉజ్జ్వలన్ తన డిటెక్టివ్ నవలల నుండి నేర్చుకున్న డిడక్షన్ టెక్నిక్‌లను ఉపయోగించి, కిల్లర్ ను కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. చివరికి ఉజ్జ్వలన్ ఆ కిల్లర్ ని పట్టుకుంటాడా ? ఆ కిల్లర్ ఎవరు ? ఎందుకు చంపుతున్నాడు ?  అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Read Also : పెళ్లి రోజే పెళ్లి కొడుకుని తీసుకెళ్లి ఇదేం పాడు పనిరా అయ్యా… ట్విస్టులతో మెంటలెక్కించే మర్డర్ మిస్టరీ

Related News

OTT Movie : భార్యాభర్తల మధ్యలోకి మరొకరు… వెన్నులో వణుకు పుట్టించే సీన్లు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : డీమాన్‌తో దిక్కుమాలిన పని… ఫ్రెండ్స్‌నే బలిచ్చి… గుండె జారిపోయే సీన్లున్న హర్రర్ మూవీ

OTT Movie : నది మధ్యలో బట్టలిప్పి ఫొటోలు… కట్ చేస్తే పార్ట్స్ ప్యాక్ అయ్యే ట్విస్ట్… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఆ పాడు పని… పోలీసులకు చెమటలు పట్టించే మాస్క్ మ్యాన్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఒంటరిగా మనిషి దొరికితే వదలకుండా అదే పని… సీను సీనుకో ట్విస్ట్… పిచ్చెక్కించే సైకో థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల ఎంఎంఎస్ కుంభకోణం… అన్నీ అలాంటి కేసులే… సింగిల్‌గా ఉన్నప్పుడే చూడండి

OTT Movie : టూరిస్ట్ గైడ్‌తో యవ్వారం… అమ్మాయి మిస్సింగ్‌తో ఊహించని టర్న్… బోన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : 800 కోట్ల బిగ్గెస్ట్ స్కామ్… ఓటీటీలోకి అడుగు పెట్టిన ‘బిచ్చగాడు’ హీరో న్యూ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×