BigTV English

Ben Stokes – Jadeja : బెన్ స్టోక్స్-జడేజా మధ్య ఏమైంది..? వీడియో వైరల్

Ben Stokes – Jadeja : బెన్ స్టోక్స్-జడేజా మధ్య ఏమైంది..? వీడియో వైరల్

Ben Stokes – Jadeja :  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇండియా-ఇంగ్లాండ్ జట్లు ప్రస్తుతం 5 టెస్ట్ సిరీస్ లు ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది.  ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ వచ్చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఓ ఎత్తు గడ వేశాడు. మ్యాచ్ ను త్వరగా ముగించేందుకు ప్రయత్నించాడు. కానీ జడేజా అతనికి ధీటైనా సమాధానం చెప్పాడు. ఈ నిర్ణయం తన చేతుల్లో లేదని.. ఆట కొనసాగిస్తానని చెప్పాడు. ఇక ఇదే సమయంలో టీమిండియా కెప్టెన్ శుబ్ మన్ గిల్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నాడు. అతని వైపు కెమెరా వెల్లినప్పుడు నవ్వుతూ కనిపించడం విశేషం. దీంతో బెన్ స్టోక్స్ రవీంద్ర జడేజా వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి డ్రా గురించి అడగడం పై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read :  Ben Stokes – Jadeja : సెంచరీలు కొట్టే టైమ్ కి ఇంగ్లండ్ కు డ్రా గుర్తొచ్చింది

జడేజా, సుందర్ సెంచరీలపై స్టోక్స్ సంచలన కామెంట్స్ 


టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలు పూర్తి చేసుకోకపోయినా. వారి పోరాటం తక్కువ కాదన్నారు. వాళ్లిద్దరూ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారని కొనియాడారు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. కేవలం మరో 10 పరుగులు వారి పోరాటానికి కొలమానం కాదన్నట్టు పేర్కొన్నాడు. జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీకి దగ్గరైన క్రమంలో ఇక మ్యాచ్ ను ముగించి డ్రాగా తీసుకుందామని ఇంగ్లాండ్ ఆటగాళ్లు భావించారు. కానీ జడేజా మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తన సెంచరీ తరువాత వాషింగ్టన్ సెంచరీ సైతం పూర్తి అయ్యేంతవరకు ఆటను కొనసాగించాడు.  వాస్తవానిక ఆట చివరి గంట ప్రారంభమైనప్పుడు స్టోక్స్ భారత్ కి డ్రా ఆఫర్ ఇచ్చాడు. కానీ జడేజా 89 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 80 పరుగులు చేయడంతో భారత జట్టు డ్రా చేసేందుకు ఒప్పుకోలేదు. మరో ఐదు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో జడేజా 5వ సెంచరీ.. వాషింగ్టన్ సుందర్ తన తొలి సెంచరీ పూర్తి చేసుకున్నారు.

స్టోక్స్ అలా చేశాడేంటి..?

సాధారణంగా మ్యాచ్ ముగిసిన తరువాత రెండు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది పరస్పరం చేతులు కలుపుతూ గౌరవం చూపిస్తుంటారు. కానీ ఈ మ్యాచ్ లో బెన్ స్టోక్స్ మాత్రం జడేజా, వాషింగ్టన్ సుందర్ తో చేతులు కలుపలేదు. దీనికి ముఖ్య కారణం మ్యాచ్ ముగిసే 15ఓవర్ల కంటే ముందు స్టోక్స్ మ్యాచ్ ను డ్రా చేద్దామని సూచించారు. జడేజా, వాషింగ్టన్ సుందర్ అందుకు ఒప్పుకోలేదు. ఆ సమయంలో భారత్ పూర్తి ఆధిప్యత్యంలో ఉండగా.. ఇంగ్లాండ్ గేమ్ లో తిరిగి వచ్చే అవకాశం లేదు. జడేజా, సుందర్ ఇద్దరికీ సెంచరీ పూర్తి చేయాలన్న వ్యక్తిగత లక్ష్యం ఉండటంతో ఆట కొనసాగించాలని నిర్నయించారు. దీంతో స్టోక్స్ అసహనం వ్యక్తం చేస్తూ.. మ్యాచ్ చివరిలో ఆయన హావభావాల్లో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు స్పష్టంగా కనిపించింది.

Related News

Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్‌ జట్టులో నో ఛాన్స్ ?

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Pakistan Cricketer : ఇంగ్లాండ్ ను ఓడించేందుకు వాజిలిన్ వాడారు…. భారత బౌలర్ల పై పాక్ సంచలన ఆరోపణలు

Mohammed Siraj : ఇండియా గడ్డపై అడుగుపెట్టిన సిరాజ్… ఎయిర్ పోర్టులో ఆయన ఫాలోయింగ్ చూడండి

Big Stories

×