Railway route changes: ప్రతి రోజూ మనం ఎక్కే రైలు, అదే మార్గంలో నడుస్తుందని మనకు అనిపించడం కామన్. కానీ వాస్తవంగా రైల్వే శాఖ తరచూ మార్గాలను తాత్కాలికంగా మార్చడం జరుగుతుంది. దీనికి కారణాలు వాతావరణ ప్రభావం, ట్రాక్ మెయింటెనెన్స్, టెక్నికల్ పనులు వంటివే. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే ఆగస్టు నెలలో కొన్ని ముఖ్యమైన రైళ్లకు మార్గాలు మార్చినట్లు ప్రకటించింది. ఈ మార్పులు తాత్కాలికమైనవే అయినా, ముందుగానే తెలుసుకుంటే ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు రావు.
విజయవాడ – చెన్నై జనశతాబ్దీకి తాత్కాలిక మార్గం
ఆగస్టు 13 నుంచి 18వ తేదీ వరకు నడిచే ట్రైన్ నెం. 12078 (విజయవాడ – చెన్నై జనశతాబ్దీ) ఇప్పుడు క్రిష్ణా కాల్ – దుగ్గిరాల – తెనాలి మీదుగా నడవనుంది. సాధారణ మార్గం వదిలి ఇది ఈసారి వేరే దారిలో వెళ్తోంది. ‘న్యూ గుంటూరు’ స్టేషన్‌కి వెళ్లే ప్రయాణికులు ఇది తప్పకుండా గమనించాలి. ముందుగా ప్లాన్ చేసుకుని, ఆ స్టేషన్ వద్ద ఎక్కడం లేదా దిగే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.
చెన్నై – చర్లపల్లి సూపర్‌ఫాస్ట్
ఆగస్టు 17 నుంచి 19వ తేదీల వరకు నడిచే ట్రైన్ నెం. 12603 (చెన్నై – చర్లపల్లి) తెనాలి – దుగ్గిరాల – విజయవాడ – కాజిపేట – పాగిడిపల్లి మార్గంలో నడవనుంది. అంటే సాధారణంగా వెళ్లే మార్గానికి బదులు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఈ మార్గం ద్వారా గుంటూరు, సత్తెనపల్లె, నదికూడ, మిర్యాలగూడ, నల్గొండ వంటి స్టేషన్లు కవర్ అవుతాయి. ఈ మార్పుతో కొంతమందికి కొత్తగా ప్రయోజనం కలుగుతుందీ, మరికొందరికి అసౌకర్యం కలగొచ్చే అవకాశం ఉంది.
చర్లపల్లి – చెన్నై సూపర్‌ఫాస్ట్ మరో మార్గంలో
ఆగస్టు 18 నుంచి 20వ తేదీల వరకు నడిచే ట్రైన్ నెం. 12604 (చర్లపల్లి – చెన్నై) పాగిడిపల్లి – కాజిపేట – విజయవాడ – దుగ్గిరాల – తెనాలి మార్గంలో ప్రయాణించనుంది. ఇది కూడా గత మార్గానికి భిన్నంగా ఉంటుంది. ఈ మార్గం ద్వారా నల్గొండ, మిర్యాలగూడ, నదికూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లె, గుంటూరు స్టేషన్లు కవర్ అవుతున్నాయి. ఈ మార్గాన్ని ఉపయోగించే ప్రయాణికులు ముందుగా స్టేషన్ వివరాలు పరిశీలించుకోవడం మంచిది.
హైదరాబాద్ – కొల్లం స్పెషల్ ట్రైన్
ఆగస్టు 9, 16 తేదీల్లో నడిచే ట్రైన్ నెం. 07193 (హైదరాబాద్ – కొల్లం స్పెషల్) మార్గాన్ని తాత్కాలికంగా మార్చుకుంది. ఇది ఇప్పుడు పాగిడిపల్లి – కాజిపేట – విజయవాడ – దుగ్గిరాల – తెనాలి మీదుగా సాగనుంది. ఈ మార్గం నల్గొండ, మిర్యాలగూడ, నదికూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లె, గుంటూరు ప్రాంతాల ప్రయాణికులకు ఉపయోగపడేలా ఉంటుంది.
కోల్లం – హైదరాబాద్ రూట్
ఆగస్టు 11, 18 తేదీలలో నడిచే ట్రైన్ నెం. 07194 (కోల్లం – హైదరాబాద్) కూడా మార్గాన్ని మార్చుకుంది. ఇది ఇప్పుడు తెనాలి – దుగ్గిరాల – విజయవాడ – కాజిపేట – పాగిడిపల్లి మీదుగా సాగనుంది. ఇది కూడా పై స్టేషన్ల ప్రయాణికులకు ప్రయోజనంగా మారుతుంది.
ఎందుకు మారుతున్నాయి ఈ మార్గాలు?
ఈ మార్గ మార్పులు తాత్కాలికమైనవే. ప్రయాణికుల భద్రత, ట్రాక్ మరమ్మత్తులు, టెక్నికల్ పనులు వంటి అవసరాల కారణంగా రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా ఈ సమాచారం తెలిసి ఉంటే.. రైలు మన స్టేషన్‌కి వస్తుందా లేదా అన్న సందేహాలు ఉండవు.
ప్రయాణికులకి మూడు ముఖ్య సూచనలు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మీరు ప్రయాణించబోయే ట్రైన్ నంబర్, తేదీ, మార్గం తప్పనిసరిగా తెలుసుకోండి. మీ స్టేషన్‌కి ఆ రైలు వస్తుందా లేదా అని నిర్ధారించుకోండి. అప్డేట్స్ కోసం www.sr.indianrailways.gov.in వెబ్‌సైట్ చూడండి లేదా 139 డయల్ చేయండి.
మీరు గుంటూరు, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె వంటి ప్రాంతాల్లో ఉంటే, ఈ మార్గ మార్పులు మీ ప్రయాణంపై ప్రభావం చూపవచ్చు. ముందుగానే తెలుసుకుని ప్లాన్ చేసుకుంటే ప్రయాణం సాఫీగా సాగుతుంది. మార్గం మారినా, గమ్యం చేరే మార్గం మీకే సురక్షితంగా ఉండాలని రైల్వే శాఖ ఆశిస్తోంది. మీరు కూడా అప్రమత్తంగా ఉండండి.. ప్రయాణం ఆనందంగా ఉంటుంది!